దారుణం.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ సీఆర్పీఎఫ్‌ జవాన్‌

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఓ జవాన్‌.. ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. జిల్లాలోని దోర్నాపాల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో సోమవారం నాడు..

దారుణం.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ సీఆర్పీఎఫ్‌ జవాన్‌

Edited By:

Updated on: Jul 31, 2020 | 5:07 PM

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఓ జవాన్‌.. ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. జిల్లాలోని దోర్నాపాల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో సోమవారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఘటన జరిగిన తర్వాతి రోజు బాధిత బాలిక తన తల్లికి చెప్పింది. పశువులను మేపేందుకు అటవీ కొండ ప్రాంతాల్లో వెళ్లగా.. అప్పుడే క్యాంపు నుంచి బయటకు వచ్చిన ఓ సీఆర్పీఎఫ్‌ జవాన్‌.. పశువులను మేపుతున్న బాలికపై కన్నుపడింది. వెంటనే బాలికను లోబర్చుకునేందుకు ప్రయత్నించగా.. బాలిక తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయితే బాలిక ప్రయత్నాలు విఫలమయ్యాయి. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై గురువారం నాడు దోర్నపాల్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధిత బాలికతో పాటు.. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Read More 

కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు

కల్తీ మద్యం కాటుకు నలుగురు మృతి

ఆఫ్ఘన్‌లో కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి