Lover Cheating: కలిసి చనిపోదాం అంటూ ప్రియురాలికి పురుగులు మందు తాగించిన ప్రియుడు.. ఆపై పారిపోయిన వైనం

Lover Cheating: ప్రేమ పేరుతో మోసం చేశాడు ఓ యువకుడు.. అయితే ఈ యువకుడు అమ్మాయిని వంచన చేసి పారిపోలేదు.. ఏకంగా మరణంలో కూడా ఇద్దరం కలిసే అంటూ..

Lover Cheating: కలిసి చనిపోదాం అంటూ ప్రియురాలికి పురుగులు మందు తాగించిన ప్రియుడు.. ఆపై పారిపోయిన వైనం
Lovers Sucide

Updated on: Jul 22, 2021 | 5:44 PM

Lover Cheating: ప్రేమ పేరుతో మోసం చేశాడు ఓ యువకుడు.. అయితే ఈ యువకుడు అమ్మాయిని వంచన చేసి పారిపోలేదు.. ఏకంగా మరణంలో కూడా ఇద్దరం కలిసే అంటూ.. చెప్పి.. ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి .. తాను మాత్రం జీవించాలని కోరుకున్నాడు.. ఈ నయవంచన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు జిల్లాలోని అమృతలూరు మండలం ఇంటూరులో ప్రేమ పేరుతో మోసం జరిగింది. ఉమామహేశ్వర్, మౌనిక లు గత ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్దలు మన ప్రేమకు ఒప్పుకోరు పెళ్లి చేసుకుందాం అని మౌనికను ఉమా మహేశ్వర్ వేరే ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకున్నా మన పెద్దలు మనఇద్దరిని కలిసి వుండనివ్వరు.. కనుక కలిసి చనిపోదాం అంటూ మౌనిక కు చెప్పాడు.. ఈ నేపథ్యంలో పురుగులు ముందుని తీసుకోచ్చిన ఉమా మహేశ్వర్ ముందుగా ఆ పురుగుల మందును మౌనిక తో తాగించాడు.

ప్రియుడి మాటలను విన్న మౌనిక పురుగులు మందు తాగింది.. అనంతరం ఉమా మహేశ్వర్ అక్కడ నుంచి పరారయ్యాడు.. ప్రస్తుతం బాధితులు మౌనిక తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. తనను ఉమా మహేశ్వర్ మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయమని కోరుతుంది.

Also Read: Green Oasis: ఎడారిలో కోట మినీ ఫారెస్ట్ గా మార్చిన ఓ టీచర్ సంకల్పం.. కొడుకుని పోగొట్టుకున్నా మొక్కల పెంపకమే అతని జీవితం