ఇదెక్కడి ఘోరంరా సామీ.. ఫ్రెండ్‌ను అమ్మాయిగా మార్చి అత్యాచారం.. ఆపై డబ్బులు..

సమాజంలో రోజురోజుకూ కామాందులు పెరిగిపోతున్నారు. ఇన్నాళ్లు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే క్రూరమృగాలు.. ఇప్పుడు అబ్బాయిలను అమ్మాయిలుగా మార్చి మరీ వాళ్ల కామ కోరికలు తీర్చుకుంటున్నారు. తాజాగా ఇలానే ఓ యువకుడు తన స్నేహితుడికి బలవంతంగా అమ్మాయిలా లింగమార్పిడి చేయించి అతనిపై లైంగిక దాడికి పాల్పడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇదెక్కడి ఘోరంరా సామీ.. ఫ్రెండ్‌ను అమ్మాయిగా మార్చి అత్యాచారం.. ఆపై డబ్బులు..
Bhopal

Updated on: Jul 03, 2025 | 3:25 PM

సమాజంలో రోజురోజుకూ కామాందులు పెరిగిపోతున్నారు. ఇన్నాళ్లు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే క్రూరమృగాలు.. ఇప్పుడు అబ్బాయిలకు అమ్మాయిలుగా లింగమార్పిడి జరిపించి మరీ వాళ్ల కామ కోరికలు తీర్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో వెలుగు చూసింది. ఓ యువకుడు తన స్నేహితుడికి బలవంతంగా అమ్మాయిలా లింగమార్పిడి చేయించి. ఆ తర్వాత అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆపై డబ్బులు ఇవ్వాలని అతన్ని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. అయితే బాధితుడి ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాళ ప్రకారం.. భోపాల్ సమీపంలోని ఒబేదుల్లాగంజ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పై చదువుల కోసం తన సోదరి అత్తమామల ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడ అతనికి నర్మదాపురాని చెందిన శుభం యాదవ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహింగా మారడంతో ఇద్దరూ కలిసి తిరగడం స్టార్ట్‌ చేసిశారు. ఈ క్రమంలో ఆ యువకుడు నగరంలోని అశోక గార్డెన్ ప్రాంతంలో శుభంతో కలిసి అద్దె గదిలో నివసిస్తున్నట్టు తెలిపాడు. అయితే ఆ సమయంలోనే శుభం తనపై అతనికున్న ప్రేమ, ఆసక్తిని చూపడం మొదలు పెట్టినట్టు బాధిత యువకుడు చెప్పాడు.

అయితే కొన్ని నెలల క్రితం, శుభం తనని తరచూ తలనొప్పికి చెక్-అప్ పేరుతో భోపాల్‌లోని MP నగర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేవాడని.. ఈ క్రమంలోనే నిందితుడు శుభం తనకు తెలియకుండా.. తలనొప్పికి ట్రీట్మెంట్‌ పేరుతో హార్మోనల్ థెరపీ చేయించాడని బాధితుడు ఆరోపించాడు. ట్రీట్మెంట్‌ చేంయిచుకున్న నెల తర్వాత తన శరీరంలో మార్పులు రావడం గమనించినట్టు బాధిత యువకుడు తెలిపాడు. ఈ మార్పులతో తాను చాలా గందరగోళానికి కూడా గురైనట్టు చెప్పాడు. తన శరీరంలో ఏమి జరుగుతుందో పూర్తిగా అర్థం కాకముందే, శుభం తనని ఇండోర్‌కు తీసుకెళ్లాడని.. అక్కడ తనకు లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించి, బలవంతంగా తనను పురుషుడి నుండి అమ్మాయిగా మార్చినట్టు తెలిపాడు. ఇందుకోసం శుభం సుమారు రూ.5లక్షల వరకు ఖర్చుపెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

అయితే లింగమార్పిడి చేయించిన తర్వాత శుభం తనను మళ్లీ నర్మదాపురానికి తీసుకొచ్చాడు. అక్కడ తనపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు, దీని కోసం తరచూ తనను వేధించేవాడని బాధిత యువకుడు ఆరోపించాడు. అంతే కాకుండా ఇప్పుడు తనకు రూ. 10 లక్షల ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడని, డబ్బు చెల్లించకపోతే తన జీవితాన్ని నాశనం చేస్తానని శుభం బెదిరించినట్టు బాధిత యువకుడు ఆరోపించాడు.

ఈ కేసుపై గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ విజేంద్ర మార్స్కోల్ స్పందిస్తూ బాధితు యువకుడి ఫిర్యాదు ఆధారంగా, ఘటనపై జీరో FIR నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో శారీరక దోపిడీ, బ్లాక్‌మెయిల్‌కు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన ప్రధానంగా నర్మదాపురంలో జరిగింది కాబట్టి, తదుపరి దర్యాప్తు కోసం కేసు డైరీని అక్కడికి తరలించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిపై కేసు నమోదు చేయలేదు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.