Heart Breaking Event: చంటి బిడ్డకు పాలిస్తూ కుప్పకూలిన తల్లి.. భర్త చేరుకునేలోపే అసువులు బాసిన ఇద్దరు.. అసలేం జరిగిందంటే..!

ఓ కన్న తల్లి చావు చంటి బిడ్డ ప్రాణం తీసింది. బిడ్డకు పాలిస్తూనే ఆ తల్లి ఒక్కసారిగా కుప్పలిపోయింది.. తన ఒళ్లో ఉన్న బిడ్డపై పడటంతో చిన్నారి కూడా అక్కడికక్కడే కన్నుమూసింది.

Heart Breaking Event: చంటి బిడ్డకు పాలిస్తూ కుప్పకూలిన తల్లి.. భర్త చేరుకునేలోపే అసువులు బాసిన ఇద్దరు.. అసలేం జరిగిందంటే..!
Baby Girl Suffocates To Death When Her Argentinian Mother Dies While Breastfeeding

Updated on: May 07, 2021 | 10:01 PM

A Heart Breaking Event: ఓ కన్న తల్లి చావు చంటి బిడ్డ ప్రాణం తీసింది. బిడ్డకు పాలిస్తూనే ఆ తల్లి ఒక్కసారిగా కుప్పలిపోయింది.. తన ఒళ్లో ఉన్న బిడ్డపై పడటంతో చిన్నారి కూడా అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ హృదయవిదారకర సంఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ విషాద ఘటన అందర్నీ కంట తడి పెట్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అర్జెంటీనాలోని కోర్రియెంట్స్‌కు చెందిన గేబ్రియల్‌, మరియానా ఒజేడా (30) దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడ పిల్లలు కాగా, ఒకరు మగ పిల్లాడు. ఇదిలావుంటే, ఇటీవలే ఓ చిన్నారికి జన్మనిచ్చింది. కొద్దిరోజుల క్రితం మరియానా భర్త ఆఫీసు వెళ్లడంతో ఇంటి పనుల్లో నిమగ్నమైంది. పెద్ద కూతురు అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. కుమారుడు, ఒక నెల చంటి బిడ్డతో ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం సమయంలో మరియానా బిడ్డకు పాలుపడుతోంది. ఇదే సమయంలో మరియానా హైబీపీతో హఠాత్తుగా బిడ్డపై కుప్పకూలి కన్నుమూసింది. తల్లి నేరుగా ముఖంపై పడటంతో ఊపిరాడక చంటిపాప కూడా మరణించింది. ఆ సమయంలో ఎక్కడే ఉన్న మూడేళ్ల కుమారుడు సైతం ఏం జరిగిందో తెలియక మిన్నకుండిపోయాడు.

అయితే, ఆమె భర్త గేబ్రియల్‌ ఇంటికి ఫోన్‌ చేయగా ఫోన్‌ రింగవుతున్నా ఎంతసేపటికీ ఎవరూ లిఫ్ట్‌ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన కుమారుడు.. తల్లి నిద్రపోతోందని తండ్రికి చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన గేబ్రియల్‌ వెంటనే ఇంటికి వెళ్లాడు. బెడ్డుపై జీవచ్ఛవాల్లా పడి ఉన్న భార్య, బిడ్డను చూసి తల్లడిల్లిపోయాడు. హఠాత్తు పరిణామంతో తేరుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి, బిడ్డ శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు.

Baby Girl Suffocates To Death When Her Mother Dies

Read Also… Viral Video : రెండు చిరుత పులుల మధ్య భీకర యుద్దం..! అదీ చెట్టుపై నుంచి.. మీరు ఓ లుక్కేయండి..