
UP Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం యూపీలోని సిద్ధార్థ్‌నగర్ జిల్లాలో జరిగింది. ఆదివారం ఉదయం.. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను గోరఖ్‌పూర్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. వివాహా ఊరేగింపు కార్యక్రమానికి హాజరై నుంచి తిరిగి వస్తుండగా బలేరో ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో కారులో 11 మంది ఉన్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొంటున్నారు.
కాగా.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదిలాఉంటే.. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.