Madhya Pradesh : నలుగురు మహిళలకు ఐదేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు.. కారణం ఇదే..

|

Feb 06, 2021 | 9:55 PM

ర్యాగింగ్ .. అబ్బాయిలు చేస్తే తట తీయడం.. అమ్మాయిలు  చేస్తే క్లాస్ తీసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ర్యాగింగ్ చేసిన మహిళలకు ఏకంగా ఐదేళ్ళు జైలుశిక్ష వాదించింది కోర్టు.

Madhya Pradesh : నలుగురు మహిళలకు ఐదేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు.. కారణం ఇదే..
Follow us on

ర్యాగింగ్ .. అబ్బాయిలు చేస్తే తట తీయడం.. అమ్మాయిలు చేస్తే క్లాస్ తీసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ర్యాగింగ్ చేసిన నలుగురు మహిళలకు ఐదేళ్ళు జైలుశిక్ష వాదించింది కోర్టు. నలుగురు మహిళలకు మధ్యప్రదేశ్‌ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. మహిళా‌ కళాశాలలో 18 ఏళ్ల యువతిని సీనియర్లు మానసికంగా, శారీరకంగా ర్యాగింగ్ పేరుతో హింసించారు. మస్తాపానికి గురైన ఆ యువతి 2013 ఆగస్ట్‌ 6న భోపాల్‌లోని పీఎన్‌టీ క్రాసింగ్‌ సమీపంలో ఉన్న తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు సూసైడ్‌ నోట్‌ రాగా.. అందులో నలుగురి పేర్లను ప్రస్తావించింది. బాధిత యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం జిల్లా జడ్జి అమిత్ రంజన్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో దేవాన్షి శర్మ, కీర్తి గౌర్, దీప్తి సోలంకి, నిధి మాగ్రే అనే నలుగురిని దోషులుగా తేల్చారు. వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నోయిడాలో దారుణం.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ బంధువులను చంపేసిన గుర్తు తెలియని దుండగులు