కూలీ పనులకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. 20మందికి పైగా గాయాలు..

|

Feb 23, 2021 | 7:07 AM

Road Accident at vinukonda: ఏపీలోని గుంటూరు జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దర్మరణం చెందగా.. 20 మందికి పైగా కూలీలకు..

కూలీ పనులకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. 20మందికి పైగా గాయాలు..
Follow us on

Road Accident at vinukonda: ఏపీలోని గుంటూరు జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దర్మరణం చెందగా.. 20 మందికి పైగా కూలీలకు గాయాలయ్యాయి. గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టంది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు ఇద్దరు కూలీలు మృతిచెందారు. చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. మొత్తం మీద ఈ ఘటనలో 20 మందికిపైగా కూలీలకు గాయాలయ్యాయని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా.. బాధిత కూలీలను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు. కర్నూలు నుంచి కూలీ పని కోసం వీరంతా గుంటూరు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు డ్రైవర్‌తోపాటు ఎర్నాల శ్రీనివాసులు, భీమయ్యగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Road Accident: ప్రకాశం జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. 14 మందికి గాయాలు..

Road Accident: ప్రకాశం జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. 14 మందికి గాయాలు..