Kodad Road Accident : సూర్యాపేట జిల్లాలోని కోదాడ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై కోదాడ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద జరిగినప్పుడు బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. బస్సు హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్తోందని.. ఈ క్రమంలో కోదాడ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడినట్లు వివరించారు. గాయపడిన వారికి చికిత్స జరుగుతుందని తెలిపారు.
అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందా.. లేక నిద్ర మత్తులో ఈ సంఘటన జరిగి ఉంటుందా, మరెదైనా కారణం ఉందా అనే విషయాలను తెలుసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: