రైతు సంఘాల్లో చీలికలు, బీకేయూ, సంయుక్త కిసాన్ మోర్చా మధ్య విభేదాలు, మారుతున్న అజెండాలు

రైతు చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న 40 కి పైగా రైతు సంఘాల్లో చీలికలు ఏర్పడుతున్నాయి. ఈ చట్టాలపై చర్చకు అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని..

రైతు సంఘాల్లో చీలికలు, బీకేయూ, సంయుక్త కిసాన్ మోర్చా మధ్య విభేదాలు, మారుతున్న అజెండాలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 18, 2021 | 5:45 PM

రైతు చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న 40 కి పైగా రైతు సంఘాల్లో చీలికలు ఏర్పడుతున్నాయి. ఈ చట్టాలపై చర్చకు అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత గుర్నామ్ సింగ్ ఛాదుని తీసుకున్న నిర్ణయం పట్ల సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. రాజకీయ పార్టీలకు, తమ నిరసనకు సంబంధం ఉండరాదని ఈ మోర్చా నేత హసన్ మొల్లా అంటున్నారు. గుర్నామ్ సింగ్ నిర్ణయాలను తాము పట్టించుకోబోమని, మా సొంత అజెండా మాకు ఉందని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశం అన్న ప్రతిపాదనను తాము అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. బహుశా అది ఆయన సొంత అభిప్రాయమై ఉండవచ్ఛు అన్నారు. తమ నేతృత్వంలోని వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిన అంశాలనే అమలు చేస్తామని ఆయన న్నారు. అయితే తమ నేతకు అసలు పార్టీలతో సంబంధమే లేదని గుర్నామ్ సింగ్ తరఫు ప్రతినిధి ఒకరు చెప్పారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పలుకుబడి ఉన్న గుర్నామ్ సింగ్ ఇటీవల ఢిల్లీలో పలు విపక్షాల నేతలను కలిసి తన ప్రతిపాదన గురించి చర్చించారు. ఇలా ఉండగా ఈ నెల 26 న నిర్వహించే  ట్రాక్టర్ ర్యాలీ పై కూడా రైతు సంఘాల్లో మెల్లగా విభేదాలు తలెత్తుతున్నాయి.

Read Also:రైతు చట్టాలపై పంజాబ్-హర్యానా రైతుల నిరసన, ‘ఢిల్లీ చలో’ కు పిలుపు, బోర్డర్లో చేరుతున్న వందలాదిమంది.

Read Also:రైతు సంఘాల ప్రతినిధులతో కొనసాగుతున్న కేంద్రం చర్చలు.. మూడు గంటలుగా సాగుతున్న భేటీ..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో