కరోనాకు చెక్ పెట్టే రెండు శక్తివంతమైన టీకాలు ఇవే అంటున్న కేంద్రమంత్రి..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 తర్వాత పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్దన్‌ స్పందించారు. కరోనాను ఎదుర్కోవాలంటే.. రెండు శక్తివంతమైన టీకాలు ఉన్నాయని.. అవి ఒకటి లాక్‌డౌన్ అయితే రెండోది సోషల్ డిస్టెన్స్ అని చెప్పుకొచ్చారు. బెన్నెట్ట అంతర్జాతీయ యూనివర్శిటీ నిర్వహించిన గ్లోబల్ ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్న సమయంలో ఈ […]

కరోనాకు చెక్ పెట్టే రెండు శక్తివంతమైన టీకాలు ఇవే అంటున్న కేంద్రమంత్రి..!
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 9:01 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 తర్వాత పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్దన్‌ స్పందించారు. కరోనాను ఎదుర్కోవాలంటే.. రెండు శక్తివంతమైన టీకాలు ఉన్నాయని.. అవి ఒకటి లాక్‌డౌన్ అయితే రెండోది సోషల్ డిస్టెన్స్ అని చెప్పుకొచ్చారు. బెన్నెట్ట అంతర్జాతీయ యూనివర్శిటీ నిర్వహించిన గ్లోబల్ ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్న సమయంలో ఈ విషయం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో.. కరోనాకు వ్యాక్సిన్ లేదని.. ఈ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్, లాక్‌డౌన్ రెండే విరుగుడన్నారు. ప్రభుత్వం చేస్తున్న సూచనలను ఖచ్చితంగా పాటించాలని.. కరోనా కేసుల విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే.. మన దేశం చాలా బెటర్‌ అని డా. హర్షవర్ధన్ అన్నారు.