Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

చంచల్‌గూడ జైలుకు అవినీతి అధికారి లావణ్య

Corruption officer Lavanya acb-custody chanchalguda-jail, చంచల్‌గూడ జైలుకు అవినీతి అధికారి లావణ్య

ఆదాయానికి మించి అక్రమాస్తులు కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య రెండు రోజుల ఏసీబీ కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవల ఏసీబీ సోదాల్లో లావణ్య ఇంట్లో లభ్యమైన నగదును చూసి షాక్ తిన్నారు. ఈ తనికీల్లో దాదాపు రూ.93లక్షల నగదు, భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆమె బంధువుల బ్యాంక్ ఎక్కౌంట్లలో కూడా భారీగా నగదు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. లావణ్య ఇంటినుంచి నగలు, నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ తహశీల్దారుగా అవార్డు పొందిన లావణ్యపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటిని రుజువులతో సహా నిరూపించే క్రమంలో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. తనికీల్లో పెద్ద ఎత్తున నగదు లభించడంతో అమెను అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో లావణ్య, కొందుర్గు వీఆర్వో అనంతయ్య‌ను రెండు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు.రెండు రోజుల ఏసీబీ కస్టడీ శనివారం ముగియంతో…వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం లావణ్య, అనంతయ్యను చంచల్‌గూడ జైలుకు తరలించారు.