చైనా.. వూహాన్ సిటీలో ప్రజలందరికీ కరోనా టెస్టులకు నిర్ణయం

చైనాలోని వూహాన్ సిటీలో ప్రజలందరికీ కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. రోజురోజుకీ కొత్త కేసులు బయటపడుతుండడంతో అక్కడి అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సిటీలో కోటీ 10 లక్షల జనాభా ఉంది. సాధారణ టెస్టులతో బాటు ప్రజలకు ‘న్యూక్లియిక్’ టెస్టులు సైతం చేస్తారట. 10 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి  చేయాలని యోచిస్తున్నారు.  ఈ సిటీలోని డాంగ్ సిహు జిల్లాలో గత రెండు రోజుల్లో ఒకేఒక అపార్ట్ మెంట్ లో ఆరు కేసులు బయటపడ్డాయి. […]

చైనా.. వూహాన్ సిటీలో ప్రజలందరికీ కరోనా టెస్టులకు నిర్ణయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 12, 2020 | 6:12 PM

చైనాలోని వూహాన్ సిటీలో ప్రజలందరికీ కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. రోజురోజుకీ కొత్త కేసులు బయటపడుతుండడంతో అక్కడి అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సిటీలో కోటీ 10 లక్షల జనాభా ఉంది. సాధారణ టెస్టులతో బాటు ప్రజలకు ‘న్యూక్లియిక్’ టెస్టులు సైతం చేస్తారట. 10 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి  చేయాలని యోచిస్తున్నారు.  ఈ సిటీలోని డాంగ్ సిహు జిల్లాలో గత రెండు రోజుల్లో ఒకేఒక అపార్ట్ మెంట్ లో ఆరు కేసులు బయటపడ్డాయి. 76 రోజుల లాక్ డౌన్ తరువాత గత నెల 8 న వూహాన్ సిటీ మళ్ళీ ఓపెన్ అయింది. అయితే పలు చోట్ల లాక్ డౌన్ ఎఫెక్ట్ కనబడుతూనే ఉంది. ప్రజలు ఇంకా బిక్కుబిక్కుమంటూనే గడుపుతున్నారు. రష్యా సరిహద్దుల్లోని రెండు రాష్ట్రాల్లో కొత్త వైరస్ క్లస్టర్లను కనుగొన్నారు. ఇంపోర్టెడ్ కరోనా కేసులు పెరుగుతుండడం పట్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. అటు రాజధాని బీజింగ్ లో కూడా ప్రతివారినీ రెండు విడతలుగా టెస్ట్ చేస్తున్నారు.