ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి.. తాజా అప్డేట్స్ ఇవే..!

ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా మహమ్మారి విళయతాండవాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే దీని బారినపడి 83వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 14.5 లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఈ వైరస్ ధాటికి అల్లాడిపోతోంది. తాజాగా.. గడిచిన 24 గంటల్లో ఇక్కడ రికార్డు స్థాయిలో మరణాల సంఖ్య నమోదైంది. దాదాపు రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. పాజిటివ్ కేసులసంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ […]

ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి.. తాజా అప్డేట్స్ ఇవే..!
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2020 | 11:00 PM

ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా మహమ్మారి విళయతాండవాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే దీని బారినపడి 83వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 14.5 లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఈ వైరస్ ధాటికి అల్లాడిపోతోంది. తాజాగా.. గడిచిన 24 గంటల్లో ఇక్కడ రికార్డు స్థాయిలో మరణాల సంఖ్య నమోదైంది. దాదాపు రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. పాజిటివ్ కేసులసంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలు దాటేసింది. వీరిలో 13వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ కూడా ఈ వైరస్ ధాటికి పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవిస్తోంది.