Breaking: తెలంగాణలో కొత్తగా 1,087 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో 3,923 కరోనా టెస్ట్‌లు జరగ్గా.. 1,087 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Breaking: తెలంగాణలో కొత్తగా 1,087 కరోనా కేసులు

Updated on: Jun 27, 2020 | 10:43 PM

తెలంగాణలో కరోనా విజృంభణ అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో 3,923 కరోనా టెస్ట్‌లు జరగ్గా.. 1,087 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13,436కు చేరింది. అలాగే 162 మంది మంది కోలుకోగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,928కు చేరింది. కరోనాతో తాజాగా ఆరు మంది చనిపోగా.. మృతుల సంఖ్య 243కు చేరింది. 8,265 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యధికంగా 888 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 74, మేడ్చల్‌లో 37, నల్గొండలో 35, సంగారెడ్డిలో 11, కామారెడ్డిలో 5, కరీంనగర్‌లో 5, సిరిసిల్లలో 3, సిద్దిపేటలో 2, వరంగల్‌ అర్బన్‌లో 7, మహబూబ్‌నగర్‌లో 5, నాగర్‌కర్నూల్‌లో 4, అసిఫాబాద్‌లో 1, ఖమ్మంలో 1,వనపర్తిలో 1, భద్రాద్రి కొత్తగూడెంలో 2, మహబూబాబాద్‌లో 1, జనగాంలో 4, మంచిర్యాలలో 1 కేసు నమోదైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us