TS Corona Cases: తెలంగాణలో కాస్త తగ్గిన కోవిడ్ కేసులు.. కొత్తగా 3,980మందికి పాజిటివ్.. జీహెచ్ఎంసీలో మాత్రం..

తెలంగాణలో కోవిడ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. పండుగ ముగిసిన వెంటనే కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా..

TS Corona Cases: తెలంగాణలో కాస్త తగ్గిన కోవిడ్ కేసులు.. కొత్తగా 3,980మందికి పాజిటివ్.. జీహెచ్ఎంసీలో మాత్రం..

Updated on: Jan 24, 2022 | 7:50 PM

Telangana Covid 19 Cases today updates: తెలంగాణలో కోవిడ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. పండుగ ముగిసిన వెంటనే కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 3,980 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,38,795 కాగా, మరణాల సంఖ్య 4,075గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 7,01,047 ఉండగా, తాజాగా 2,398 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.89 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 33,673 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, ఇవాళ మొత్తం 97,113 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,14,75,932 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, ఇవాళ కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,439 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపారు. తర్వత స్థానాల్లో మేడ్చెల్ జిల్లాలో 344 మంది, రంగారెడ్డి జిల్లాలో 234 మంది, హన్మకొండ జిల్లాలో 159, ఖమ్మం జిల్లాలో 110 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక, మిగిలిన జిల్లాల్లో 100 లోపే కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.

ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..

Loading...
Unable to load recommendations.
Follow Us