నాకు ఆనందాన్నిచ్చే చోటు ఇదే-సానియా మీర్జా

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించటంతో భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా ఇంటికే పరిమితమయ్యారు. ఆమెతోపాటు ఆమె ముద్దుల తయుడు కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మార్చి నెలలో తొలిసారి లాక్‌డౌన్ విధించిన కొద్దిరోజుల ముందే యుఎస్ఏ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన సానియా మీర్జా.. కొడుకు ఇజాన్‌తో కలిసి ఇక్కడే ఉంటున్నారు. అయితే… సానియా మీర్జా (జూన్ 09)మంగళవారం నాడు తన కుమారుడితో ఉన్న అందమైన ఫొటోను ట్విట్టర్‌లో పేస్ట్‌ చేశారు. ‘నా హ్యాపీ ప్లేస్‌ ఇదే’.. […]

నాకు ఆనందాన్నిచ్చే చోటు ఇదే-సానియా మీర్జా

Updated on: Jun 09, 2020 | 9:39 PM

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించటంతో భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా ఇంటికే పరిమితమయ్యారు. ఆమెతోపాటు ఆమె ముద్దుల తయుడు కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మార్చి నెలలో తొలిసారి లాక్‌డౌన్ విధించిన కొద్దిరోజుల ముందే యుఎస్ఏ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన సానియా మీర్జా.. కొడుకు ఇజాన్‌తో కలిసి ఇక్కడే ఉంటున్నారు.

అయితే… సానియా మీర్జా (జూన్ 09)మంగళవారం నాడు తన కుమారుడితో ఉన్న అందమైన ఫొటోను ట్విట్టర్‌లో పేస్ట్‌ చేశారు. ‘నా హ్యాపీ ప్లేస్‌ ఇదే’.. అంటూ ఫొటో కింద కామెంట్‌ కూడా పెట్టారు. అంతకుముందు…షోయబ్ మాలిక్ పాకిస్థాన్‌లో చిక్కుకుపోయాడు.. నేను ఇక్కడే ఉండిపోయాను. మా ఇద్దరికీ ఈ ఎడబాటు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే.. చిన్న పిల్లాడు ఇజాన్ ఉన్నాడు కదా..? మళ్లీ ఎప్పుడు ఇజాన్ తన తండ్రిని చూస్తాడో..? అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. ఆ తర్వాత.. భర్త లేకుండానే రంజాన్‌ పండుగను హైదరాబాద్‌ ఇంట్లో కుమారుడు, సోదరి, తల్లిదండ్రులతో కలిసి జరుపుకొన్నారు సానియా మీర్జా.