ముంబైలో హోం క్వారంటైన్‌లోకి స‌ల్మాన్‌ఖాన్ !?

ముంబైలో హోం క్వారంటైన్‌లోకి స‌ల్మాన్‌ఖాన్ !?

ముంబ‌యిలో గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్‌లో సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్, తల్లి సల్మాఖాన్ మాత్రమే ఉంటున్నారు. వారితో..

Jyothi Gadda

|

May 14, 2020 | 3:39 PM

బాలీవుడ్ ప్ర‌ముఖ హీరో స‌ల్మాన్ ఖాన్ ముంబ‌యిలోని బంద్రా ప్రాంతంలో నివాస‌ముంటున్నార‌నే సంగ‌తి తెలిసిందే. బంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్‌లో స‌ల్మాన్ త‌ల్లిదండ్రుల‌తో పాటు నివాస‌ముంటున్నారు. గెలాక్సీ అపార్ట్ అంటే స‌ల్మాన్ కు ఎంతో ఇష్ట‌మ‌ని అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఎందుకంటే ఆ అపార్ట్ మెంట్‌కి త‌న‌కి చిన్న‌నాటి నుంచి అనేక జ్ఞాప‌కాలు ముడిప‌డి ఉన్నాయ‌ని చెబుతుంటారు. అయితే, ప్ర‌స్తుతం క‌రోనా, లాక్‌డౌన్ కి ముందు స‌ల్మాన్ త‌మ ఫామ్‌హౌజ్‌కి వెళ్లార‌ట‌. మార్చి 24 నుండి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ పొడిగించ‌డంతో స‌ల్మాన్ అక్క‌డే ఉండిపోవాల్సి వ‌చ్చింద‌ట‌. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…

లాక్‌డౌన్ ప్రారంభమయ్యే సమయానికి తన ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. లాక్‌డౌన్ తర్వాత బయటకు వచ్చే వీలు లేకపోవడంతో 50 రోజులు అక్కడే ఉన్నాడు.  మే 17 నుంచి 4వ లాక్‌డౌన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సల్మాన్ ముంబైలోని తన ఇంటికి వచ్చేసినట్టు సమాచారం. ముంబ‌యిలో గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్‌లో సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్, తల్లి సల్మాఖాన్ మాత్రమే ఉంటున్నారు. వారితో కలిసి సమయం గడపడానికి ఫామ్‌హౌస్ నుంచి సల్మాన్ ముంబై వచ్చేశాడట. ముంబైలోని ఇంటికి వచ్చి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడట.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu