పాల కోసం ఏడుస్తున్న పాప.. రైలు వెంట పరుగెత్తిన పోలీస్

| Edited By: Pardhasaradhi Peri

Jun 04, 2020 | 7:52 PM

మధ్యప్రదేశ్ లో ఓ ఆర్ పీ ఎఫ్ కానిస్టేబుల్ చూపిన మానవతను, ధైర్యాన్ని, సమయ స్ఫూర్తిని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలతో ముంచెత్తారు. అతనికి క్యాష్ రివార్డు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. షరీఫ్ హష్మి  అనే మహిళ తన నాలుగు నెలల పసిపాపతో బాటు బెల్గాం నుంచిగోరఖ్ పూర్ కి శ్రామిక్ రైల్లో వెళ్తుండగా రైలు ఓ ప్లాట్ ఫామ్ పై ఆగింది. అయితే పాలకోసం ఆమె పాప గుక్క పట్టి ఏడుస్తుండగా ఆమెకు ఎవరూ […]

పాల కోసం ఏడుస్తున్న పాప.. రైలు వెంట పరుగెత్తిన పోలీస్
Follow us on

మధ్యప్రదేశ్ లో ఓ ఆర్ పీ ఎఫ్ కానిస్టేబుల్ చూపిన మానవతను, ధైర్యాన్ని, సమయ స్ఫూర్తిని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలతో ముంచెత్తారు. అతనికి క్యాష్ రివార్డు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. షరీఫ్ హష్మి  అనే మహిళ తన నాలుగు నెలల పసిపాపతో బాటు బెల్గాం నుంచిగోరఖ్ పూర్ కి శ్రామిక్ రైల్లో వెళ్తుండగా రైలు ఓ ప్లాట్ ఫామ్ పై ఆగింది. అయితే పాలకోసం ఆమె పాప గుక్క పట్టి ఏడుస్తుండగా ఆమెకు ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేకపోయారు.

అప్పుడే ఆ దృశ్యం చూసిన ఇందర్ సింగ్ యాదవ్ అనే ఆర్ఫీ ఎఫ్ పోలీసు పరుగున వెళ్లి స్టేషన్ బయట ఓ పాల ప్యాకెట్ కొన్నాడు. కానీ అప్పటికే రైలు కదలడంతో ఇందర్ సింగ్ ఏ మాత్రం సంకోచించకుండా రైలు వెనుకే పరుగులు తీస్తూ మొత్తానికి ఆ పసికందుకు పాల ప్యాకెట్ అందించగలిగాడు. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డయింది. ఆ తల్లి అతనికి కృతజ్ఞతలు చెబుతుండగానే రైలు వేగం అందుకుంది. ఓ పసిబిడ్డకు సమయానికి తాను ఆకలి తీర్చగలిగానని ఇందర్ సింగ్ తనలో తాను తృప్తి చెందాడు. .