ఏప్రిల్ 20 తరువాత అక్క‌డ‌ పాక్షిక సడలింపు : ప‌్ర‌ధాని మోదీ

మే 3వ తారీకు వరకూ దేశ వ్యాప్త లాక్ డౌన్ ను పొడగిస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ...రేపటి నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ ను మ‌రింత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఏప్రిల్ 20 తరువాత నుంచి..

ఏప్రిల్ 20 తరువాత అక్క‌డ‌ పాక్షిక సడలింపు : ప‌్ర‌ధాని మోదీ
Follow us

|

Updated on: Apr 14, 2020 | 11:23 AM

మే 3వ తారీకు వరకూ దేశ వ్యాప్త లాక్ డౌన్ ను పొడగిస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ…రేపటి నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ ను మ‌రింత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఏప్రిల్ 20 తరువాత నుంచి గ్రీన్ జోన్ ప్రాంతాలలో లాక్ డౌన్ ను పాక్షికంగా సడలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే నిబంధనల ఉల్లంఘనలు జరిగితే మళ్లీ లాక్‌డడౌన్‌ కఠినంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. కరోనా కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవలసిన అవ‌స‌రం ఉందని చెప్పారు. ఎకానమీ కంటే జీవితం గొప్పదన్న ప్రధాని మోదీ దేశ ప్రజల కోసం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ల‌క్‌డౌన్‌న్ ను కఠినంగా అమలు చేయక తప్పదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ పై మార్గదర్శకాలను రేపు ప్రకటించనున్నారు.

లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తనకు తెలుసునన్న మోదీ.. మంగ‌ళ‌వారం జాతి నుద్దేశించి ప్ర‌సంగించారు. మోదీ చేసిన ప్రసంగంలో జనం అంతా ఎవరికి వారు ఒక సైనికుడిలా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నార‌ని, రాజ్యాంగంలోని వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అన్న దానికి అర్ధం ఇదేనని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి రోజున భారత ప్రజల సామూహిక శక్తిని చాటుతూ ఆయనకు నివాళి అర్పిస్తున్నామన్న మోడీ లాక్ డౌన్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూనే పండుగలను జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

కొన్ని రాష్ట్రాలలో ఇప్పుడు నూతన సంవత్సర వేడుక జరుపుకుంటున్నారనీ, ఆయా రాష్ట్రాల ప్రజలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నానని మోడీ అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందన్న ఆయన అందుకు దేశ ప్రజలు అందించిన సహకారం, మహమ్మారిపై విజయం సాధించాలన్న పట్టుదల సంకల్పం బహుదా ప్రశంసనీయమని పేర్కొన్నారు. జనం భాగస్వామ్యంతోనే మహమ్మారిపై విజయం సాధ్యమౌతుందని చెప్పారు.