కోల్‌కత్తా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం

|

May 27, 2020 | 5:36 PM

కోల్‌కత్తా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంఫాన్‌తో అతలాకుతమైన పశ్చిమ బెంగాల్‌ను ఆదుకొనేందుకు ముందుకు వచ్చింది. అంఫాన్‌తో నష్టపోయిన ప్రాంతాల్లో ఐదు వేల చెట్లు నాటాలని కూడా నిర్ణయించినట్లు వెల్లడించింది. బెంగాల్‌ సీఎం రిలీఫ్ ఫం‌డ్‌కి కూడా విరాళాలు అందిస్తామని రెండు సార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన కేకేఆర్‌ జట్టు యజమాని షారుఖ్‌ఖాన్‌ ప్రకటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిరాశ్రయులైనవారి తమ జట్టు సభ్యులు ఆదుకుంటారని తెలిపారు. వారికి కావాల్సిన ఆహారపదార్థాలు, ఇతర సామగ్రిని అందిస్తారని చెప్పారు. […]

కోల్‌కత్తా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం
Follow us on

కోల్‌కత్తా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంఫాన్‌తో అతలాకుతమైన పశ్చిమ బెంగాల్‌ను ఆదుకొనేందుకు ముందుకు వచ్చింది. అంఫాన్‌తో నష్టపోయిన ప్రాంతాల్లో ఐదు వేల చెట్లు నాటాలని కూడా నిర్ణయించినట్లు వెల్లడించింది. బెంగాల్‌ సీఎం రిలీఫ్ ఫం‌డ్‌కి కూడా విరాళాలు అందిస్తామని రెండు సార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన కేకేఆర్‌ జట్టు యజమాని షారుఖ్‌ఖాన్‌ ప్రకటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిరాశ్రయులైనవారి తమ జట్టు సభ్యులు ఆదుకుంటారని తెలిపారు. వారికి కావాల్సిన ఆహారపదార్థాలు, ఇతర సామగ్రిని అందిస్తారని చెప్పారు.

అంఫాన్‌ తుఫాన్ కారణంగా కోల్‌కతాతోపాటు తూర్పు మిడ్నాపూర్‌, దక్షిణ 24 పరగణాలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. లక్షలాది మంది ఆర్థికంగా నష్టపోగా.. 86 మంది చనిపోయారు.