కవిత చేయూత… గల్ఫ్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు విముక్తి

కరోనా కారణంగా కష్టాల్లో చిక్కుకున్న వారికి నేనున్నానంటూ, చేయూతనిస్తున్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ‌లాక్‌డౌన్ వల్ల గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఏడుగురు తెలంగాణ వాసులు మాజీ ఎంపీ కవిత సహకారంతో స్వస్థలాలకు చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కొడిగేల నాగేశ్వరరావు, దాసరి రాజు, చింతల కళ్యాణ్, తోక వెంకటేశ్, మోరుబోయిన గోపాల్, గంగాధర్ శరతకల్ల, అజయ్ కోలంకి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం దుబాయ్ కి వెళ్లారు. అయితే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి, ప్రత్యేక […]

కవిత చేయూత... గల్ఫ్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు విముక్తి
Follow us

|

Updated on: Jul 23, 2020 | 6:21 PM

కరోనా కారణంగా కష్టాల్లో చిక్కుకున్న వారికి నేనున్నానంటూ, చేయూతనిస్తున్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ‌లాక్‌డౌన్ వల్ల గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఏడుగురు తెలంగాణ వాసులు మాజీ ఎంపీ కవిత సహకారంతో స్వస్థలాలకు చేరుకున్నారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన కొడిగేల నాగేశ్వరరావు, దాసరి రాజు, చింతల కళ్యాణ్, తోక వెంకటేశ్, మోరుబోయిన గోపాల్, గంగాధర్ శరతకల్ల, అజయ్ కోలంకి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం దుబాయ్ కి వెళ్లారు. అయితే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి, ప్రత్యేక విమానంలో కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం చేరుకున్నారు. కరోనా నిబంధనల ప్రకారం, ఏడుగురు వ్యక్తులు, త్రివేండ్రం లో క్వారంటైన్ లో ఉన్నారు. అయితే క్వారంటైన్ ముగిసినా లాక్‌డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లేందుకు వాహనాలు లేక, డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదే విషయాన్ని, బాధితుల సన్నిహితులు ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన మాజీ ఎంపీ కవిత, ఏడుగురు స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు‌. ఇందులో భాగంగా త్రివేండ్రం నుండి హైదరాబాద్ కు ఉచితంగా విమాన ‌టికెట్లు అందించారు. గురువారం హైదరాబాద్ చేరుకున్న ఏడుగురు స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు మాజీ ఎంపీ కవిత.

అడిగిన వెంటనే స్పందించి, స్వస్థలాలకు చేరుకునేందుకు సహకరించిన మాజీ ఎంపీ కవిత గారికి వారు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.