ఫ్రెంచ్ ఓపెన్‌కు రూట్ క్లీయర్..!

|

Jul 04, 2020 | 3:16 PM

సెప్టెంబరులో జరగనున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌కు నిబంధనలతో కూడా అనుమతులను ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. రోజుకు 20 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతించారు...

ఫ్రెంచ్ ఓపెన్‌కు రూట్ క్లీయర్..!
Follow us on

ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు కరోనా మహమ్మారి నుంచి భయటపడుతున్నాయి. భయట పడతున్న దేశాలు కొవిడ్-19 ఆంక్షలను తొలిగిస్తున్నాయి. ఇందులో ఆష్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పటికే నిబంధనలను కొద్ది కొద్దిగా సడలిస్తున్నాయి. ఫ్రాన్స్ లో క్రీడా మైదానాల్లో అతి తక్కువ మంది ప్రేక్షకులతో క్రీడా పోటీలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. 40 వేల సామర్థ్యం ఉన్న స్టేడియంలోకి కేవలం 10 వేల మందికి మాత్రమే అనుతిని ఇచ్చింది. అది కూడా అప్పుడున్న పరిస్థితులకు అనుగూనంగా ఈ నిర్ణయం ఉంటుందని ప్రకటించింది.

సెప్టెంబరులో జరగనున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌కు నిబంధనలతో కూడా అనుమతులను ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. రోజుకు 20 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతించారు. ఈ రోలాండ్‌ గారోస్‌ స్టేడియాల కెపాసిటీలో 60 శాతం మందికి మాత్రమే ఎంట్రీకి అనుమతి ఇస్తున్నారు. ఇక ఫైనల్‌ మ్యాచ్‌లకు  10 వేల మందిని మాత్రమే అనుమతించారు. అయితే సామాజిక దూరంపై ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం ఈ సంఖ్య మారే ఛాన్స్ ఉందని నిర్వాహకులు తెలిపారు. మేలో జరగాల్సిన ఈ టోర్నీని వచ్చే సెప్టెంబరుకు వాయిదా వేశారు.