ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఒక్కరోజే 2,137..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల్లో.. అత్యధికంగా వస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఇప్పటికే ఇక్కడ 36 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఒక్కరోజే 2,137..

Updated on: Jun 12, 2020 | 11:00 PM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల్లో.. అత్యధికంగా వస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఇప్పటికే ఇక్కడ 36 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం నాడు 2,137 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 36,824కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 1214 మంది మరణించారని.. 13,398 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us