‘ఇదే ఛాన్స్ ! కోవిడ్-19 ని ఆ పథకంకింద ‘ఎదుర్కోండి’… ప్రపంచ ఆరోగ్య సంస్థ

కోవిడ్-19 అనేక దేశాలకు పెను సవాలుగా మారుతోందని, ఈ నేపథ్యంలో  చేబట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్..'ఆయుష్మాన్ భారత్' ని వేగవంతం చేయడానికి ఇదే మంచి అవకాశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియాకు..

ఇదే ఛాన్స్ ! కోవిడ్-19 ని ఆ పథకంకింద ఎదుర్కోండి... ప్రపంచ ఆరోగ్య సంస్థ

Edited By:

Updated on: Jun 06, 2020 | 7:14 PM

కోవిడ్-19 అనేక దేశాలకు పెను సవాలుగా మారుతోందని, ఈ నేపథ్యంలో  చేబట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్..’ఆయుష్మాన్ భారత్’ ని వేగవంతం చేయడానికి ఇదే మంచి అవకాశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియాకు సూచించింది. ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ కేర్ పై దృష్టి పెట్టాలని కోరింది. భారత్ లో పెరిగిపోతున్న కరోనా కేసులపై మీడియా అడిగిన ప్రశ్నలకు  ఈ సంస్థ హెడ్… టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ సమాధానమిస్తూ.. పలు దేశాలకు ఇది చాలెంజింగ్ సమయమని, కానీ ఈ తరుణంలోనే అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఉదాహరణకు భారత దేశాన్నే తీసుకుంటే.. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని స్పీడప్ చేయడానికి ఆ దేశానికి ఇది చక్కని సమయమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఈ పథకానికి కట్టుబడి ఉన్న విషయం తనకు తెలుసునని, ప్రైమరీ హెల్త్ కేర్, కమ్యూనిటీ ఎంగేజ్ మెంట్.. అన్న అంశాలకు ఆ దేశం ఎంతో ప్రాధాన్యమిస్తున్నదని టెడ్రోస్ చెప్పారు. కరోనా క్రైసిస్ ని ఎదుర్కోవాలంటే ఈ లక్ష్యాన్ని సాధించగలగాలన్నారు.

2018 లో ప్రధాని మోదీ లాంచ్ చేసిన ఆయుష్మాన్ భారత్..ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ పథకం.. దేశంలో ఈ పథకం కింద కోటిమందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందారని మోదీ ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us