వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 6.78 లక్షలు..

ప్రపంచవ్యాప్తంగా 17,586,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 678,906 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 11,009,689 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 6.78 లక్షలు..

Updated on: Jul 31, 2020 | 9:27 PM

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 287,063 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా 6427 మరణాలు సంభవించాయి. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 17,586,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 678,906 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 11,009,689 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(4,652,842), మరణాలు(155,716) సంభవించాయి. ఇక బ్రెజిల్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 26 లక్షలు దాటగా.. 90 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అటు రష్యాలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాగా, భారత్‌లో కరోనా కేసులు 1,690,546 నమోదు కాగా, మృతుల సంఖ్య 36,497కి చేరింది.

Loading...
Unable to load recommendations.
Follow Us