షాకింగ్: సౌదీ రాయల్ ఫ్యామిలీలో 150మందికి కరోనా వైరస్‌..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. సౌదీ రాజకుటుంబానికి సోకింది. ఆ కుటుంబంలో 150మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.

షాకింగ్: సౌదీ రాయల్ ఫ్యామిలీలో 150మందికి కరోనా వైరస్‌..!

Updated on: Apr 10, 2020 | 7:39 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. సౌదీ రాజకుటుంబానికి సోకింది. ఆ కుటుంబంలో 150మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రియాద్ గవర్నర్‌గా ఉన్న సీనియర్ యువరాజు ఐసీయూలో ఉండగా.. రాజు సల్మాన్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. అలాగే డజన్ మందికిపైగా ఇతర కుటుంబీకులకు చికిత్స జరుగుతుందని అంతర్జాతీయ మీడియాలు వెల్లడించారు.

వీరిలో కొంతమంది సభ్యులు తీవ్రంగా జబ్బుపడ్డారని.. కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సౌదీ రాజకుటుంబానికి చికిత్స అందించే కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ ఆసుపత్రి అధికారులు 500 పడకలు ఏర్పాటుచేయాల్సిందిగా ప్రభుత్వ అంతర్గత అధికారులు సందేశం పంపారు. దీంతో వారికి కరోనా సోకిన విషయం బయటకువచ్చింది. ఆసుపత్రుల్లో ఇప్పటికే ఉన్న కేసుల్ని వైద్యులు త్వరగా పంపిచేస్తున్నారని.. అత్యవసర కేసుల కోసం దేశవ్యాప్తంగా సిద్దమవుతున్నారని తెలుస్తోంది. కాగా సౌదీలో ఇప్పటివరకు 2,932 మందికి కరోనా వైరస్ సోకగా, 41 మంది చనిపోయారు. 631 మహమ్మారి నుంచి కోలుకున్నారు.

Read This Story Also: కరోనా లక్షణాలున్నా దాచినందుకు ముగ్గురిపై కేసు నమోదు

Loading...
Unable to load recommendations.
Follow Us