ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం.. గడిచిన 24 గంటల్లో 6,59,863 పాజిటివ్ కేసులు, 11,089 మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మునపటి కంటే..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం.. గడిచిన 24 గంటల్లో 6,59,863 పాజిటివ్ కేసులు, 11,089 మరణాలు..

Updated on: Nov 21, 2020 | 12:38 PM

Coronavirus Cases World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మునపటి కంటే ఈసారి రోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజు 6,59,863 పాజిటివ్ కేసులు, 11,089 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 57,910,582కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,377,762 మంది కరోనాతో మరణించారు. ఇక 40,108,895 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు..

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 12,274,726కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 260,283 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, అర్జంటినా, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 9,050,613 కేసులు నమోదు కాగా.. 132,764 మంది వైరస్ కారణంగా మరణించారు. ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజూ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us