ఏపీలో నాలుగో కరోనా మృతి.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!

ఏపీలో మరో కరోనా మృతి నమోదైంది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి(45) కరోనాతో బాధపడుతూ ఇవాళ మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

ఏపీలో నాలుగో కరోనా మృతి.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 2:45 PM

ఏపీలో మరో కరోనా మృతి నమోదైంది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి(45) కరోనాతో బాధపడుతూ ఇవాళ మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కాగా సోమవారం సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం 9గంటల వరకు రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదైంది. గుంటూరు జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో కరోనా బాధితుల సంఖ్య 304కు చేరింది. ఇక జిల్లాల వారీగా అనంతపురంలో 6, చిత్తూరులో 17, తూర్పు గోదావరిలో 11, గుంటూరులో 33, కడప 27, కృష్ణ 29, కర్నూల్ 74, నెల్లూరు 42, ప్రకాశం 24, విశాఖపట్నం 20, పశ్చిమ గోదావరిలో 21 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఆరుగురు డిశ్చార్జ్‌ అయ్యారు.

మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులో తీసుకొచ్చింది. హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రదేశాల్లో ర్యాండంగా పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే మొదటి విడతలో ఇంటింటి సర్వే పూర్తి కాగా.. రెండో విడత సర్వేను వాలంటీర్లు, ఆశ వర్కర్లు, ఎఎన్ఎమ్‌లు సిద్ధమయ్యారు. వీరు విదేశాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అనుమానితులు, అనారోగ్యంతో బాధపడే వారిని గుర్తించే పనిలో వీరు వేగం పెంచనున్నారు.

Read This Story Also: AA20:బన్నీ మూవీ టైటిల్‌ ఇదేనా..!

Latest Articles
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే