కస్టమర్లకు అలెర్ట్.. మారిన ఏటీఎం, బ్యాంక్, పీఎఫ్ రూల్స్ వివరాలివే..

| Edited By:

Jul 01, 2020 | 7:28 PM

కోవిడ్ సంక్షోభం కారణంగా బ్యాంకులు ఏటీఎం నగదు విత్‌డ్రా నిబంధనల్ని సడలించి కస్టమర్లకు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. బ్యాంకులు ఏటీఎం సర్వీస్ ఛార్జీలను తొలగించాయి. కరోనాతో ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత ఎన్ని సార్లు డబ్బులు డ్రా...

కస్టమర్లకు అలెర్ట్.. మారిన ఏటీఎం, బ్యాంక్, పీఎఫ్ రూల్స్ వివరాలివే..
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్ధేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి దశ అన్‌లాక్ 1.0 ముగిసిందని.. అన్‌లాక్ 2.0లోకి అడుగుపెడుతున్నామని.. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. ఇక జులై 1 నుంచి అనేక రూల్స్ అమలులోకి రానున్నాయి. లాక్‌డౌన్ కారణంగా కొద్ది నెలల ముందు నియమనిబంధల్ని సడలించిన విషయం తెలిసిందే. జులై 1 నుంచి మళ్లీ పాత రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఏటీఎం, బ్యాంకు విత్ డ్రా ఛార్జీలు, మినిమమ్ బ్యాలెన్స్ మెయింటనెన్స్ పీఎఫ్ నిబంధనలు లాంటి అంశాల్లో జులై 1 నుంచి మార్పులు ఉంటాయి.

ఏటీఎం రూల్స్: కోవిడ్ సంక్షోభం కారణంగా బ్యాంకులు ఏటీఎం నగదు విత్‌డ్రా నిబంధనల్ని సడలించి కస్టమర్లకు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. బ్యాంకులు ఏటీఎం సర్వీస్ ఛార్జీలను తొలగించాయి. కరోనాతో ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత ఎన్ని సార్లు డబ్బులు డ్రా చేసినా ఛార్జీలు వేయమని పేర్కొంది. కానీ ఈ సడలింపులు కేవలం 2020 జూన్ 30 వరకు మాత్రమే. దీంతో నేటి నుంచి ఏటీఎం రూల్స్ మారనున్నాయి.

మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా కేంద్రం సేవింగ్స్ అకౌంట్‌లో మినిమమ్ ఛార్జీలను కూడా తొలగించింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాయి బ్యాకింగ్ సంస్థలు. దీంతో జూన్ 30 వరకూ మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు. అయితే ప్రధాని అన్‌లాక్ 2.0 తర్వాత జులై 1 నుంచి మళ్లీ ఈ పాత రూల్స్ వర్తిస్తాయి.

ఈపీఎఫ్ విత్‌డ్రా రూల్స్: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా.. ఉద్యోగులు నగదు కొరతతో ఇబ్బందులు పడకూడదని ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) కోవిడ్ పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఎఫ్ ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం లేదా మూడు నెలల బేసింగ్+డీఏలో ఏది తక్కువ అయితే అది విత్‌ డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ సంస్థ పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ అవకాశం జూన్ 30 వరకూ మాత్రమే.

Read More: 

108 ఉద్యోగులకు సీఎం జగన్ వరం.. భారీగా జీతాలు పెంపు