AP Corona Cases: ఏపీ ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి.. లక్ష దాటి టెన్షన్ పెడుతోన్న యాక్టివ్ కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అంటున్నారు.

AP Corona Cases: ఏపీ ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి.. లక్ష దాటి టెన్షన్ పెడుతోన్న యాక్టివ్ కేసులు
Ap Corona Cases

Updated on: Jan 26, 2022 | 5:40 PM

Andhra Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరిగింది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  తాజాగా 24 గంటల వ్యవధిలో 49,143 శాంపిల్స్ ని పరీక్షించగా 13,618 మందికి కరోనా సోకినట్లు తేలింది.  ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2222573 కి చేరింది. కొత్తగా కోవిడ్ కారణంగా తూర్పు గోదావరి(East Godavari), నెల్లూరు(Nellore), విశాఖపట్నం(Vizag) జిల్లాలలో ఇద్దరు, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి లలో ఒక్కొ క్కరు చొప్పు న మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14570కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 106318 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో8,687 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2101685కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,22,83,369 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా విశాఖ జిల్లాలో ప్రమాదకరంగా 1791 కొత్త కేసులు వెలుగుచూశాయి. అనంతపురం కూడా పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. జిల్లాలో కొత్తగా 1650 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 1409 కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు దిగువ పట్టికలో చూడండి..

కరోనా సమాచారం మీ చేతుల్లోనే:

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.

● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు

● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు

వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.

● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app.  ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

Also Read: కోవిడ్ పాజిటివ్ మహిళకు ప్రసవం చేయడానికి వైద్యుల నిరాకరణ.. వారిపై సీరియస్ యాక్షన్

Loading...
Unable to load recommendations.
Follow Us