AP Corona Cases: ఏపీలో కొత్తగా 12,926 కరోనా కేసులు.. ఆ 2 జిల్లాల్లో వైరస్ టెర్రర్

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అంటున్నారు.

AP Corona Cases: ఏపీలో కొత్తగా 12,926 కరోనా కేసులు.. ఆ 2 జిల్లాల్లో వైరస్ టెర్రర్
Ap Corona Cases

Updated on: Jan 22, 2022 | 5:30 PM

Andhra Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరిగింది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  తాజాగా 24 గంటల వ్యవధిలో 43,763 శాంపిల్స్ ని పరీక్షించగా 12,926 మందికి కరోనా సోకినట్లు తేలింది.  ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2166194 కి చేరింది. కొత్తగా కోవిడ్ కారణంగా  విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు,  నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14538కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 73143 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 3,913 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2078513కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,21,00,381 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా విశాఖ జిల్లాలో ప్రమాదకరంగా 1959 కొత్త కేసులు వెలుగుచూశాయి. చిత్తూరులో కూడా పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. జిల్లాలో కొత్తగా 1566 కేసులు నమోదయ్యాయి.

జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు దిగువ పట్టికలో చూడండి..

కరోనా సమాచారం మీ చేతుల్లోనే:

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.

● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు

● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు

వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.

● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app.  ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

Also Read:    Telangana: అక్కడ జీలుగు కల్లుకు యమ డిమాండ్.. ఏకంగా సీసా రూ.500.. ముందు బుక్ చేసుకుంటేనే

Loading...
Unable to load recommendations.
Follow Us