అనుపమ్ ఖేర్ తల్లికి కరోనా పాజిటివ్..

బాలీవుడ్ క్యారక్టర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ తల్లి దులారీకి కరోనా పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ..తన తల్లిని ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేర్చినట్టు వెల్లడించారు. తనకు నెగెటివ్..

అనుపమ్ ఖేర్ తల్లికి కరోనా పాజిటివ్..

Edited By:

Updated on: Jul 12, 2020 | 12:05 PM

బాలీవుడ్ క్యారక్టర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ తల్లి దులారీకి కరోనా పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ..తన తల్లిని ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేర్చినట్టు వెల్లడించారు. తనకు నెగెటివ్ రిపోర్టు వచ్చిందని, అయితే సోదరుడు రాజు ఖేర్, తన కుటుంబంలోని మరో ఇద్దరు సభ్యులకు పాజిటివ్ వచ్చిందని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్ఛన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్ఛన్ లకు కూడా ఈ వైరస్ సోకడంతోను, ఇప్పుడు అనుపమ్ ఖేర్ తల్లి సైతం కోవిడ్-19 కి గురి కావడంతో బాలీవుడ్ లో కలవరం మొదలైంది. వీరు త్వరగా కోలుకోవాలంటూ అభిమానులంతా ట్వీట్లు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us