మీకు సెల్యూట్‌ అమ్మా: తుని మహిళపై ఏపీ డీజీపీ ప్రశంసలు

కరోనా వైరస్‌ లాక్‌డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన ఓ మహిళ కూల్‌డ్రింక్‌ అందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

మీకు సెల్యూట్‌ అమ్మా: తుని మహిళపై ఏపీ డీజీపీ ప్రశంసలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 18, 2020 | 6:54 PM

కరోనా వైరస్‌ లాక్‌డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన ఓ మహిళ కూల్‌డ్రింక్‌ అందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ స్పందించారు. ఆమె వివరాలు తెలుసుకున్న గౌతమ్‌.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా ఆమెతో మాట్లాడారు. మీ అమ్మతనానికి మేమంతా చలించిపోయాం. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై మీరు చూపిన ప్రేమకు మేమంతా సెల్యూట్ చేస్తున్నాం అని కృతఙ్ఞతలు తెలిపారు.

కాగా దినసరి కూలీగా చేస్తోన్న ఆ మహిళ పోలీసుల కోసం కూల్‌డ్రింక్స్‌ తీసుకొచ్చి అందివ్వగా.. దాన్ని వారు సున్నితంగా తిరస్కరించడంతో పాటు పిల్లలకు ఇవ్వండి అంటూ తమ దగ్గర ఉన్న కూల్‌డ్రింక్స్‌ను ఇచ్చారు. అంతేకాకుండా ఆమెతో అమ్మా.. వీలైతే రోజు ఒకసారి వచ్చి మాకు కనిపించండి. మాకు ధైర్యంగా ఉంటుంది అని పోలీసులు ఆ వీడియోలో చెప్పారు. ఇక ఈ వీడియో వైరల్‌గా మారగా.. సర్వత్రా ఆ మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నటుడు మాధవన్ సైతం ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనర్హం.

Read This Story Also: కరోనాపై పోరు.. మాజీ నటి దంపతుల ఉదారభావం..!