‘కరోనా వీరుల’కు థ్యాంకూ చెబుతూ.. ఐశ్వర్య కూతురు ఏం చేసిందంటే!

'కరోనా వీరుల'కు థ్యాంకూ చెబుతూ.. ఐశ్వర్య కూతురు ఏం చేసిందంటే!

'కరోనా వీరుల'కు థాంక్యూ చెబుతూ ఐశ్వర్య కూతురు గారాలపట్టి ఆరాధ్య బచ్చన్.. తనలోని సృజనాత్మకతను బయటపెట్టింది. తానే స్వయంగా థ్యాంక్స్ తెలుపుతూ ఓ చిత్రాన్ని..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 04, 2020 | 10:10 PM

‘కరోనా వీరుల’కు థాంక్యూ చెబుతూ ఐశ్వర్య కూతురు గారాలపట్టి ఆరాధ్య బచ్చన్.. తనలోని సృజనాత్మకతను బయటపెట్టింది. తానే స్వయంగా థ్యాంక్స్ తెలుపుతూ ఓ చిత్రాన్ని గీసింది ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య. తమ ప్రాణాలను పణంగా పెట్టి, కరోనాపై అహర్నిశలు పోరాడుతోన్న వీరులపై తన ప్రేమను చాటుకుంది. వారికి ధన్యవాదాలు చెబుతూ ఓ చిత్రాన్ని గీసింది. దీనిని ఐష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుడు, జర్నలిస్ట్, సెక్యూరిటీ గార్డ్ అందరూ ఉన్నారు. వీరందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతూ.. వారి పట్ల తనకున్న ప్రేమను చాటుకుంది ఆరాధ్య. అలాగే తాను బయటకి వెళ్లకుండా ఇంట్లోనే అమ్మా, నాన్నలు అభిషేక్, ఐశ్వర్యల మధ్యలో ఉన్నట్లు ఇందులో గీసింది. అలాగే ‘స్టే హోమ్.. స్టే సేఫ్’ అంటూ పేర్కొంది.

View this post on Instagram

✨❤️🌟🇮🇳🌏🌸🥰my darling Aaradhya’s Gratitude and Love ❤️✨🙏

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: ఆయుష్మాన్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu