కరోనా కేసులు.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..

కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీలో కొత్తగా 138 కేసులు న‌మోదు కాగా, తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా మరో 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసులు.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..
Follow us

|

Updated on: Jun 06, 2020 | 9:10 AM

కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీలో కొత్తగా 138 కేసులు న‌మోదు కాగా, తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా మరో 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధిక కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే 116 నమోదవ్వగా.. రంగారెడ్డి 8, ఆదిలాబాద్ 2,మేడ్చల్ 2, సంగారెడ్డి 2, ఖమ్మం 2, వరంగల్ 3, మహబూబ్‌నగర్ 5, మంచిర్యాల 1, కరీంనగర్‌లో 2 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.

దీనితో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,290కి చేరింది. వీరిలో 1627 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో 1,550 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఎనిమిది మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 113కి చేరింది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. రాష్ట్రంలో కొత్త‌గా 138 కేసులు న‌మోదు అయ్యాయి. వాటిలో వివిధ జిల్లాల‌కు చెందిన వారు 50మంది, వ‌ల‌స కూలీలు 84మందికి, ఎన్ఆర్ఐలు న‌లుగురికి క‌రోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో న‌మోదైన కేసుల సంఖ్య 4250కి చేరింది. వాటిలో 13 జిల్లాల‌లో 3427కేసులు, విదేశాల నుంచి వ‌చ్చిన 123 కేసులు, వ‌ల‌స కూలీలకు చెందిన 700 కేసులున్నాయి. కరోనాతో తాజాగా కృష్ణాజిల్లాలో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 73మంది మ‌ర‌ణించారు. ఇప్పటివరకు 2294 మంది వివిధ జిల్లాలోనూ, వ‌ల‌స కూలీలు 258 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1060యాక్టివ్ కేసులు ఉండ‌గా, విదేశాల నుంచి వ‌చ్చిన 119 మంది, వ‌ల‌స కూలీలు 442 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందు‌తున్నారు.

Also Read:

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

ఏపీలో మరిన్ని సడలింపులు.. ఆలయాలు, హోటల్స్, మాల్స్‌కు నయా రూల్స్…

కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, బెంగళూరుకు బస్సులు.. కానీ!

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!