Breaking News
  • తెలంగాణలో వర్షాలను కేంద్రం గమనిస్తోంది. ఇళ్లు, పంటలు వరద ముంపునకు గురయ్యాయి. వరద నష్టం అంచనా వేసేందుకు.. రేపటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. ప్రవీణ్‌ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం. కేంద్ర బృందంలో జలశక్తి శాఖ ఉన్నతాధికారులు. వరద బాధితులకు కేంద్ర సాయం అందుతుంది. వైపరీత్యాల వల్ల చనిపోయినవారికి.. రూ.4 లక్షలు పరిహారం ఇవ్వాలని మోదీ గతంలోనే నిర్ణయించారు. కేంద్ర సాయం అందేలోపు ఎస్డీఆర్‌ఎఫ్‌ నుంచి ఖర్చు చేయాలి. తర్వాత కేంద్రం రీఎంబర్స్‌మెంట్‌ చేస్తుంది-కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.
  • అమరావతి: ఉపాధి హామీ కూలీలపై మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం, ఉపాధి కూలీలకు మంత్రి ధర్మాన క్షమాపణ చెప్పాలి-టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌.
  • భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముంది. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్‌.
  • హైదరాబాద్‌: వీడిన కూకట్‌పల్లి కిడ్నాప్‌ మిస్టరీ. 24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు. రహీంను ఆటోలో కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు. రహీంను పఠాన్‌చెరు తీసుకెళ్లిన కిడ్నాపర్లు. తల్లి రేష్మకు ఫోన్‌ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్‌. భయంతో రూ.10 వేలు ట్రాన్సఫర్‌ చేసిన తల్లి. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా కిడ్నాపర్ల గుర్తింపు. ప్రధాన నిందితుడు సలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు లక్కీ. లక్కీ కోసం గాలిస్తున్న పోలీసులు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రికి పొంచి ఉన్న ముప్పు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని సమాచారం. భారీ వర్షాలకు 4 అంగుళాలు బీటలు వారిన కొండ. అప్రమత్తమైన ఇంజినీరింగ్‌ అధికారులు. ఈవో సురేష్‌బాబుకు సమాచారమిచ్చిన అధికారులు.
  • నేటి నుంచి ఈ నెల 31 వరకు కోవిడ్‌ అవగాహన కార్యక్రమాలు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌తో నేడు అవగాహన ర్యాలీ. రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గడం సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ భౌతిక దరం పాటించాలి, మాస్క్‌ ధరించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని.
  • దివాకర్‌ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్. కర్నాటక లోకాయుక్తను ఆశ్రయించిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై ఫిర్యాదు. బీఎస్‌-3 వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్‌ చేయించిన యాజమాన్యం. 33 బస్సులు, లారీలను కర్నాటకలో నడుపుతున్న దివాకర్‌ ట్రావెల్స్. లోకాయుక్తకు ఆధారాలు సమర్పించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి. కర్నాటక రవాణాశాఖ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,166 కొత్త కేసులు.. 10 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,166 కొత్త కేసులు నమోదయ్యాయి.

Telangana Corona Bulletin, కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,166 కొత్త కేసులు.. 10 మరణాలు

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,166 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,74,774 కు చేరింది. 24 గంటల్లో 10 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,052కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,143మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,44,073 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 29,649 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 53,690  పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 25,73,005 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 309, ఆదిలాబాద్ 21, భద్రాద్రి కొత్తగూడెం 79, జగిత్యాల్‌ 21, జనగాం 79, జయశంకర్ భూపాలపల్లి 20, జోగులమ్మ గద్వాల్‌ 20, కామారెడ్డి 50, కరీంనగర్‌ 127, ఖమ్మం 87, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 19, మహబూబ్‌ నగర్‌ 28, మహబూబాబాద్‌ 90, మంచిర్యాల్‌ 43, మెదక్‌ 36, మేడ్చల్ మల్కాజ్‌గిరి 147, ములుగు 22, నాగర్‌ కర్నూల్‌ 46, నల్గొండ 133, నారాయణ్‌పేట్‌ 11, నిర్మల్‌ 22, నిజామాబాద్‌ 90, పెద్దంపల్లి 50, రాజన్న సిరిసిల్ల 51, రంగారెడ్డి 166, సంగారెడ్డి 44, సిద్ధిపేట్‌ 88, సూర్యాపేట 64, వికారాబాద్‌ 24, వనపర్తి  33, వరంగల్‌ రూరల్‌ 23, వరంగల్‌ అర్బన్‌ 95, యాద్రాది భువనగిరి 48 కేసులు నమోదయ్యాయి.

Read more:

చాలా తెలివిగా ఆడుతోంది.. గంగవ్వపై కళ్యాణి సంచలన కామెంట్లు

ఇవాళ ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్

Related Tags