ఇంత దారుణమా.. కరోనా సోకిందని భర్తను మధ్యలోనే వదిలేసి..

కరోనా మహమ్మారి మనుషుల మధ్య దూరాన్ని అమాంతం పెంచేసింది. అంతేకాదు.. మనుషుల్లో ఉన్న నిజ స్వరూపాన్ని బయటపెట్టిస్తోంది. ఈ మహమ్మారి సోకితే.. కనీసం కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రాని పరిస్థితి నెలకొంది. దీంతో..

ఇంత దారుణమా.. కరోనా సోకిందని భర్తను మధ్యలోనే వదిలేసి..
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 7:51 PM

కరోనా మహమ్మారి మనుషుల మధ్య దూరాన్ని అమాంతం పెంచేసింది. అంతేకాదు.. మనుషుల్లో ఉన్న నిజ స్వరూపాన్ని బయటపెట్టిస్తోంది. ఈ మహమ్మారి సోకితే.. కనీసం కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రాని పరిస్థితి నెలకొంది. దీంతో కరోనా సోకిన వ్యక్తుల పరిస్థితి ఘోరంగా మారుతోంది. అంతేకాదు.. ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్నా.. వైరస్ సోకినా వారిని ప్రయాణాల్లో కూడా అనుమతివ్వడం లేదు. అనుమానం కల్గితే మధ్యలోనే వదిలేస్తున్నారు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని కరపలో ఓ సంఘటన చోటుచేసుకుంది. డయాలసిస్ చేయించుకుని ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో తన ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకిందనే సమాచారం తెలియడంతో.. ఆయన్ను మధ్యలోనే దింపేశారు బస్సు డ్రైవర్‌. అయితే ఆయన రామచంద్రపురానికి వెళ్లేందుకు కాకినాడలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. అయితే ఆయనకు కరోనా పరీక్షలు చేసిన తర్వాత.. రిపోర్టులు వచ్చే వరకు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. అయితే వారు మాత్రం ఉండకుండా.. అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఆర్టీసీ బస్సు ఎక్కేశారు. అయితే ఈ విషయాన్ని ఆర్టీసీ సిబ్బందికి తెలియ జేయడం.. ఆ వెంటనే రిపోర్ట్ కూడా పాజిటివ్ రావడంతో అధికారుల వెంటనే బస్సు డ్రైవర్‌కు సమాచారం అందించారు. దీంతో బస్సు డ్రైవర్‌ ఆ భార్యభర్తలను కరప మార్కెట్‌ సెంటర్‌ వద్ద దింపేశారు. అయితే అతడితో పాటు దిగిన తన భార్య కాసేపటికే అదృశ్యం అయ్యింది. దీంతో బాధితుడు ఒక్కడే నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. బాధితుడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..