తమిళనాట తెలు‘గోస’.. ఫళని స్వామి ఏమన్నారంటే?

తమిళనాడు రాష్ట్రంలో మళ్ళీ గణనీయంగా పెరుగుతున్నాయి కరోనా పాజిటివ్ కేసులు. గత మూడు, నాలుగు రోజులుగా తగ్గు ముఖం పట్టిన కేసులు శనివారం (ఏప్రిల్ 18) ఉదయానికి ఒక్కసారిగా రెట్టింపు పెరగడంతో అధికారులు ఆందోళనలో పడిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా

తమిళనాట తెలు‘గోస’.. ఫళని స్వామి ఏమన్నారంటే?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 18, 2020 | 8:44 AM

తమిళనాడు రాష్ట్రంలో మళ్ళీ గణనీయంగా పెరుగుతున్నాయి కరోనా పాజిటివ్ కేసులు. గత మూడు, నాలుగు రోజులుగా తగ్గు ముఖం పట్టిన కేసులు శనివారం (ఏప్రిల్ 18) ఉదయానికి ఒక్కసారిగా రెట్టింపు పెరగడంతో అధికారులు ఆందోళనలో పడిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 56 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ అని తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా 1323 మందికి కరోనా వైరస్ సోకినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా 283 మంది ఇప్పటి వరకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని సమాచారం. అందులో 103 మంది శుక్రవారం ఒక్కరోజే డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని ప్రభుత్వాసుపత్రిలో కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న 30 మందికి.. ఆస్పత్రి వైద్య సిబ్బంది వారు మునుముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తమను ఈ మహమ్మారి నుండి కాపాడిన వైద్యసిబందికి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

తమిళనాడులో ఎంతో మంది తెలుగు ప్రజలు పలు జిల్లాలో వలస కూలీలుగా ఉంటూ ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఒక పూట భోజనానికి పలు చోట్ల కష్టపడుతున్న వరాకి చెన్నై తెలుగు సంఘం సాయం అందిస్తోంది. తెలుగు ప్రముఖులు వీలైనంత సాయం చేస్తున్నారు. ద్రావిడ దేశం పార్టీ రాష్ట్రంలో చిక్కుకున్న శ్రీకాకుళం వలస కూలీలకు సహాయ సహకారాలను అందజేస్తున్నారు

తమిళనాడు ప్రభుత్వం కూడా చెన్నైతోపాటు తిరుప్పూర్, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలో వివిధ పనులకోసం వచ్చి లాక్ డౌన్‌లో చిక్కుకున్న వలస కూలీలకు కనీస వసతుల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీచేసింది. సేలం జిల్లాలో వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఎం మీడియాతో మాట్లాడుతూ… అన్ని శాఖల సమన్వయంతో కరోనాపై యుద్దం ప్రకటించటం ద్వారా రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన సాదారణ పరిస్థితి తీసువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం ప్రస్తుత విపత్కర పరిస్థితులను అర్థం చేసుకోకుండా వారి వారి రాజకీయ లబ్ది కోసం రాష్ట్ర ప్రభుత్వంఫై దుష్ప్రచారానికి పాల్పడడం దారుణమని ఆయనన్నారు. రాజకీయ విమర్శలపై స్పందించే సమయం లేదన్న ఫళనిస్వామి.. తాము పూర్తిగా కరోనా మహమ్మారిని తమిళనాడు రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి అన్ని చర్యలు చేపడతామని అన్నారు.