Breaking News
  • అమరావతి: ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ–2020’ పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష: జాతీయ విద్యా విధానం–2020లో ఏం ప్రస్తావించారు? రాష్ట్రంలో ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉంది? వంటి అన్ని అంశాలపై వివరించిన అధికారులు. సమీక్షలో సీఎం జగన్ మోహన్ రెడ్డి. అన్ని కాలేజీలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించి ఎన్‌ఏసీ,ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ పొందాలి. కాలేజీల్లో ప్రమాణాలపై ఎస్‌ఓపీలు ఖరారు చేసి అన్ని కాలేజీలలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయండి. 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేయండి టీచర్‌ ట్రెయినింగ్‌ కాలేజీలపై దృష్టి పెట్టండి. ప్రమాణాలు లేకపోతే నోటీసులు ఇవ్వండి మార్పు రాకపోతే ఆ కాలేజీలను మూసి వేయండి.
  • కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ముగ్గురికి బెయిల్. ఎమ్మార్వో నాగరాజు పై మరో కేసు నమోదు కావడంతో బెయిల్ నిరాకరించిన ఏసీబీ కోర్ట్. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆంజిరెడ్డి, శ్రీనాథ్, విఆర్ఏ సాయి రాజ్ లకు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్ట్.
  • ట్రాయ్ కొత్త ఛైర్మన్‌గా పీడీ వాఘేలా నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.
  • సైబరాబాద్ కమిష్నరేట్ మొయినాబాద్ పొలిస్టేషన్ పరిధిలోని హిమయత్ నగర్ లో 25వ తేది అత్మహత్య చేసుకున్న ‌మహిళ కేసును చేదించిన మొయినాబాద్ పొలీసులు . అత్మహత్యకు కారకుడైనా భతుకు మధుసుధన్ యాదవ్ ను అదునులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు . కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
  • వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం జగన్. జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ మాధవ్. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద బోరు బావులను తవ్వే రిగ్గు వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. రింగు వాహనాలతో నగరంలో భారీ ర్యాలీ.
  • చెన్నై: ఎస్పీ బాలు హాస్పిటల బిల్లుల వివాదంపై ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం, ఎస్పీ చరణ్ సంయుక్త ప్రెస్ మీట్. మా ఆసుపత్రి మీద రూమర్లు సృష్టించవద్దు. బిల్లుల విషయంలో ఎలాంటి వివాదం లేదు. మేము ప్రతివారం బిల్లులు చెల్లిస్తూనే ఉన్నాము. చివర్లో బిల్లు కట్టవలసిన అవసరం లేదని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. కానీ మూడు కోట్ల బిల్లు అయిందని ఇంకా కోటిన్నర పెండింగ్ ఉందని అందుకనే నాన్నగారి భౌతిక కాయాన్ని అప్పగించలేదని కట్టు కథలు అల్లారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన కుమార్తె దీపా వెంకట్ బిల్లు చెల్లించారంటూ ప్రచారం చేశారు. మేము నాన్నని కోల్పోయి బాధలో ఉంటే మమ్మల్ని ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఇంకా బాధ పెడుతున్నారు. తామరై పక్యం లో నాన్నగారి స్మృతి వనం నిర్మిస్తాము. నాన్నగారి కి భారత రత్న వస్తే సంతోషమే.. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఎప్పుడూ ఆయన భారతరత్నే. ఆయన ఏ ప్రోగ్రామ్ కి హాజరైనప్పుడు కరోనా సోకిందనేది ఇప్పుడు అప్రస్తుతం.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది..మేము నాన్నగారిని కోల్పోయాము. ఇప్పటికైనా నాన్నగారి మీద దుష్ప్రచారాలు ఆపండి.

అన్న‌వ‌రం ఆల‌యంలో కోవిడ్ క‌ల‌క‌లం.. ద‌ర్మ‌నాలు నిలిపివేత‌

తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా అన్న‌వ‌రంలోని శ్రీ వీర వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ స్వామి వారి ఆల‌యంలో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో ఆగ‌ష్టు 23 వ‌ర‌కు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాలు నిలిపివేస్తున్న‌ట్లు దేవ‌స్థాన ఈవో త్రినాథ‌రావు..

Corona Effect: Annavaram Temple Darshan Closed, అన్న‌వ‌రం ఆల‌యంలో కోవిడ్ క‌ల‌క‌లం.. ద‌ర్మ‌నాలు నిలిపివేత‌

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న విష‌యం తెలిసిందే. రోజు రోజుకీ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రోజుకి వేల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతూండ‌టంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అందులోనూ కోవిడ్ కేసులు అధికంగా ఉన్న ప‌లు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు అధికారులు. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా అన్న‌వ‌రంలోని శ్రీ వీర వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ స్వామి వారి ఆల‌యంలో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో ఆగ‌ష్టు 23 వ‌ర‌కు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాలు నిలిపివేస్తున్న‌ట్లు దేవ‌స్థాన ఈవో త్రినాథ‌రావు తెలిపారు.

ఇటీవ‌లే ఆల‌యంలోని 650 మంది సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా అందులో 50 మందికి పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. దీంతో ఈ నెల 9 నుంచి 14 వ‌ర‌కు ఆల‌యంలో ద‌ర్శ‌నాల‌ను నిలిపివేశారు అధికారులు. అయితే ఈ నెల 11వ తేదీన మ‌రో 250 మంది సిబ్బందికి కోవిడ్ టెస్టులు చేశారు. వారికి సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సింది. ఈ క్ర‌మంలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఈ నెల 23 వ‌ర‌కు ద‌ర్శ‌నాలు నిలిపివేస్తున్న‌ట్లు దేవ‌స్థానం ప్ర‌క‌టించింది. వ్ర‌తాలు, క‌ల్యాణం, చండీ, ఆయుష్య హోమాలు, త్రికాల పూజ‌ల‌న్నీ ఏకాంతంగా నిర్వ‌హించ‌బ‌నున్న‌ట్లు ఆల‌య ఈవో త్రినాథ‌రావు పేర్కొన్నారు.

Read More:

బిగ్‌బాస్ సీజ‌న్-4 లేటెస్ట్ ప్రోమోః నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో?

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ హెచ్చ‌రిక‌

ప‌నికి రావ‌డం లేద‌ని 12 ఏళ్ల బాలుడిని చావ‌గొట్టిన య‌జ‌మాని

Related Tags