రోజురోజుకీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో సోమవారం కొత్తగా 94 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య..

రోజురోజుకీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 9:31 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో సోమవారం కొత్తగా 94 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2792కి చేరింది. తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమ‌వారం రాత్రి బులిటెన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 94 కొత్త కేసులు న‌మోదు కాగా.. అందులో 79 మంది జీహెచ్ఎంసీ ప‌రిధిలోని వారేన‌ని తెలిపింది.

రంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చల్ జిల్లాలో 3, మెదక్ జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, జనగాం, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైంద‌ని తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1491కి చేరింద‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అలాగే కొత్త‌గా ఆరుగురు మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 88కి చేరిన‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం మొత్తంగా 1213 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని పేర్కొంది.

ఇక ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో సోమవారం 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ కోవిడ్ కేసుల సంఖ్య 31118కి చేరింది. గడిచిన 24 గంటల్లో కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని సోమవారం 34 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 885 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇది కూడా చదవండి:

కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

ప్రపంచంపై కరోనా పంజా.. పెరుగుతున్న మరణాలు