Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

”ఫ్యాన్స్‌కి షేక్ హ్యాండ్..ఆపై డెటాల్‌తో హ్యాండ్ వాష్”.. హీరో విజయ్‌పై సంచలన ఆరోపణలు

director samy against hero vijay, ”ఫ్యాన్స్‌కి షేక్ హ్యాండ్..ఆపై డెటాల్‌తో హ్యాండ్ వాష్”.. హీరో విజయ్‌పై సంచలన ఆరోపణలు
కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత..ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో విజయ్.  కెరీర్ బిగినింగ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా..కొంత కాలంగా ఇళయదళపతి నటిస్తున్న సినిమాలు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాయి. దాంతో సహజంగానే అభిమానించడంలో ముందుండే అరవ ప్రేక్షకులు..విజయ్‌ని ఎంతగానో ఓన్ చేసుకున్నారు. కాగా రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రకృతి వైపరిత్యాల వచ్చిన తరుణంలో ఆర్థికంగా సహాయం చేస్తూ విజయ్ తన మంచి మనసును చాటుకుంటారు. అంతేకాదు తన అభిమానులకు ఏదైనా అవసరం వస్తే వెంటనే స్పందిస్తాడు. వారికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తను స్వయంగా వెళ్లి వారి బాగోగులు తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి.
కానీ ఇదంతా విజయ్‌లోని ఒక యాంగిలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఓ తమిళ దర్శకుడు. అతడిలోని మరో యాంగిల్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం అని అంటున్నాడు.  సామి అనే తమిళ దర్శకుడు మాట్లాడుతూ.. విజయ్ తన అభిమానుల విషయంలో కర్కశంగా వ్యవహరిస్తుంటారని, అందరూ అనుకున్నంత సౌమ్యుడు కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. విజయ్ తన అభిమానులపై చూపించే ప్రేమంతా నాటకమేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. బాక్సాఫీస్ లెక్కల కోసమే విజయ్ అలా ప్రేమను కురిపిస్తుంటాడని దానిని అభిమానులు నమ్మొద్దని వ్యాఖ్యానించారు.
అతడు అభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెంటనే డెటాల్ తో తన చేతులు శుభ్రం చేసుకుటాడని, అభిమానులు ఆయనకు అంత నీచంగా కనిపిస్తుంటారని ఘాటు ఆరోపణలు చేశారు. ఈవెంట్స్ లో అనవసరమైన విషయాలు మాట్లాడతారని, అలాంటి మాటలు ఆయన తగ్గించుకోవాలని అన్నారు. అయితే సామి ఇలా విజయ్‌పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నారన్న విషయం మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. సామి ఇంతకుముందు ‘సింధు సామవేళి’ అనే కాంట్రవర్శియల్ సినిమాని తెరకెక్కించారు. పలు ప్రయోగాత్మక చిత్రాలతో ఆయన తమిళ ప్రేక్షకులకు సుపరిచితం.
కాగా ఈ వ్యాఖ్యలపై ఇళయదళపతి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.