హుజూర్‌నగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి

హుజూర్‌నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పేరును పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉత్తమ్ భార్య పద్మావతి 2018 డిసెంబరు ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ […]

హుజూర్‌నగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి
Follow us

| Edited By:

Updated on: Sep 24, 2019 | 11:34 PM

హుజూర్‌నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పేరును పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉత్తమ్ భార్య పద్మావతి 2018 డిసెంబరు ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా పనిచేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్‌కుమార్.. ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగానూ గెలిచారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్లో ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో అందరి కంటే ముందుగా టీఆర్ఎస్ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇప్పటికే ఆయన బీ-ఫామ్ అందుకున్నారు. ఇక బీజేపీ సైతం శ్రీకళా రెడ్డిని తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది.

ఈ ఎన్నికను టీఆర్ఎస్ ప్రభుత్వానికి రెఫరెండంగా భావిస్తామని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని మొదలుపెట్టారు. కేటీఆర్ పలు సభలో పాల్గొని సైదిరెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. మరోవైపు తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నామని చెప్పుకుంటున్న బీజేపీ..లోక్‌సభ ఎన్నికల తరహాలోనే టీఆర్ఎస్-కాంగ్రెస్‌లకు షాక్ ఇవ్వాలని భావిస్తోంది.

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం