బ్రేకింగ్.. భారత్-చైనా మధ్య ఘర్షణ.. సైనికాధికారి సహా ఇద్దరు జవాన్ల మృతి

భారత-చైనా మధ్య ఘర్షణ పరిస్థితులు తలెత్తాయి. నిన్న లడఖ్ లోని గాల్వాన్ వ్యాలీ ప్రాంతంలో ఉభయ దేశాల సైనిక దళాలు ఎదురుపడగా..

బ్రేకింగ్.. భారత్-చైనా మధ్య ఘర్షణ.. సైనికాధికారి సహా ఇద్దరు జవాన్ల మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 16, 2020 | 2:45 PM

భారత-చైనా మధ్య ఘర్షణ పరిస్థితులు తలెత్తాయి. నిన్న లడఖ్ లోని గాల్వాన్ వ్యాలీ ప్రాంతంలో ఉభయ దేశాల సైనిక దళాలు ఎదురుపడగా హఠాత్తుగా చైనా సైనికులు జరిపిన దాడి ల్లో ఓ భారత సైనికాధికారి, ఇద్దరు జవాన్లు మరణించారు.అయితే ఈ ఘర్షణలో ఉభయ దళాల మధ్య రాళ్ళ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితిని నివారించేందుకు రెండు దేశాల సైనికాధికారులు చర్చలు ప్రారంభించినట్టు సమాచారం.

నిజానికి గాల్వాన్ వ్యాలీలో ఉద్రిక్థతల నివారణకు రెండు దేశాలూ ప్రయత్నిస్తుండగా.. ఈ హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఉభయ దేశాల సైనికులు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారని, ఈ ఘర్షణలో భారత కల్నల్ స్థాయి అధికారి సహా ఇద్దరు జవాన్లు మృతి చెంద్రని, అదే సమయంలో చైనా దళాల్లో లోకూడా కొంతమంది గాయపడడమో, మరణించడమో జరిగిందని సమాచారం. గాల్వాన్ వ్యాలీలోని పాంగాంగ్ సో, డెమ్ చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోనూ కొన్ని వారాలుగా భారత్..చైనా సైనికుల మధ్య ఉద్రిక్థత కొనసాగుతోంది. పాంగాంగ్ సో తో బాటు పలు డీ-ఫ్యాక్టో బోర్డర్స్ లో.. ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలు ముందుకు చొచ్ఛుకువచ్చాయి.

చర్చలు జరిగినప్పటికీ పాంగాంగ్ సరస్సు వద్ద గస్తీ తిరుగుతున్న రెండు దేశాల సైనికులూ ఒక దశలో పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే ఈ నెల 6 న ఉభయ దేశాల సైనికాధికారుల మధ్య మళ్ళీ  చర్చలు జరిగిన దరిమిలా.. గాల్వాన్ ప్రాంతంలో చైనా సైన్యం కొంత వెనక్కి తగ్గగా.. భారత ఆర్మీ కూడా తన సైనిక వాహనాలతో బాటు తిరిగి వెనక్కి మళ్లింది.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..