ఒకే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు

నాటింగ్‌హమ్ వేదికగా నిన్న ఆతిధ్య ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరిగింది. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 14 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం సాధించింది. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ ఈ మ్యాచ్‌లో ఓ రికార్దు నెలకొల్పాడు. వరల్డ్‌కప్ ఒకే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్న నాలుగో ఫీల్డర్‌గా అరుదైన ఘనత సాధించాడు. గతంలో భారత ఆటగాడు మహ్మద్ కైఫ్.. 2003లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, పాక్ […]

ఒకే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు
Follow us

|

Updated on: Jun 04, 2019 | 7:55 AM

నాటింగ్‌హమ్ వేదికగా నిన్న ఆతిధ్య ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరిగింది. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 14 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం సాధించింది. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ ఈ మ్యాచ్‌లో ఓ రికార్దు నెలకొల్పాడు. వరల్డ్‌కప్ ఒకే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్న నాలుగో ఫీల్డర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

గతంలో భారత ఆటగాడు మహ్మద్ కైఫ్.. 2003లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్ 2015లో ఐర్లాండ్‌పై, బంగ్లా ఆటగాడు సౌమ్య సర్కార్.. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించారు.