‘బిగ్ బీ’ కి.. చిరు ఝలక్… ఏం చేశారంటే..?

మెగాస్టార్‌ చిరంజీవి  పోరాట యోధుడిగా చేస్తున్న ‘సైరా’ చిత్రం అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్‌ఇండియన్‌ మూవీగా అత్యధిక స్క్రీన్స్‌పై ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్ భాగంగా అమితాబ్, చిరంజీవిలను ఈ సినిమా హిందీ వెర్షన్‌‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఫర్హాన్ అఖ్తర్ వీళ్లిద్దరిని ఇంటర్వ్యూ చేసారు.  ఈ సందర్భంగా […]

'బిగ్ బీ' కి.. చిరు ఝలక్... ఏం చేశారంటే..?
Follow us

|

Updated on: Sep 28, 2019 | 8:52 PM

మెగాస్టార్‌ చిరంజీవి  పోరాట యోధుడిగా చేస్తున్న ‘సైరా’ చిత్రం అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్‌ఇండియన్‌ మూవీగా అత్యధిక స్క్రీన్స్‌పై ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సిద్దమవుతున్నారు.

తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్ భాగంగా అమితాబ్, చిరంజీవిలను ఈ సినిమా హిందీ వెర్షన్‌‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఫర్హాన్ అఖ్తర్ వీళ్లిద్దరిని ఇంటర్వ్యూ చేసారు.  ఈ సందర్భంగా అమితాబ్, చిరంజీవి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి .. అమితాబ్ బచ్చన్ ఇచ్చిన అమూల్యమైన సలహాను పట్టించుకోలేదంట. అవును..ఈ విషయాన్ని స్వయంగా బిగ్‌ బి అమితాబే చెప్పాడు.

ముందుగా అమితాబ్ మాట్లాడుతూ.. మొట్టమొదటిసారిగా చిరంజీవిని  ‘హమ్’ షూటింగ్ ఊటీలో జరగుతుండగా అక్కడ కలిశానని తెలిపారు.  చిరంజీవి తను హిందీలో మొదటి సారి చేసిన స్ట్రయిట్ మూవీ ‘ప్రతిబంధ్’ సినిమా అమితాబ్‌కు చూపించాలని అపాయింట్‌మెంట్ కోరారట. అలా ఇద్దరూ ఊటీలో తొలిసారి కలుసుకున్నామన్నామని వివరించారు. మరోవైపు బిగ్‌బీ మాట్లాడుతూ.. నేను చిరంజీవి గారికి ఎన్నో సలహాలు ఇచ్చాను. కానీ ఆయన పాటించలేదు. పాలిటిక్స్‌లోకి వెళ్లొద్దని సలహా ఇచ్చాను కానీ ఆయన నా మాటను పెడచెవిన పెట్టారంటూ గుర్తు చేసుకున్నారు.  అప్పట్లో తాను కూడా రాజకీయాల్లోవెళ్లి ఎన్నో ఇబ్బందులను ఎదర్కున్నాను. నా లాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని చిరుకు ఈ సలహా ఇచ్చానన్నారు అమితాబ్. ఇదే సలహాను రజనీకాంత్‌కు కూడా ఇచ్చాను కానీ ఆయన కూడా వినలేదంటూ అమితాబ్‌ వెల్లడించాడు.

కాగా విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్‌, నయన తార, తమన్నా, జగపతి బాబు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ‘సైరా’  చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెరకెక్కించన విషయం విధితమే.