సెక్యూరిటీ కోసం..చిప్ తో కూడిన ఈ-పాస్ పోర్టులు రానున్నాయ్ !

భారత ట్రావెల్ డాక్యుమెంట్ల సెక్యూరిటీ కోసం ప్రభుత్వం సరికొత్త విధానాన్ని చేపట్టింది. చిప్ తో కూడిన ఈ-పాస్ పోర్టుల తయారీకి అనువుగా ప్రొక్యూర్ మెంట్ ప్రాసెస్ ని చేపట్టినట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. వీటిని ప్రవేశపెట్టడంవల్ల ప్రయాణ సంబంధ పత్రాలు..

సెక్యూరిటీ కోసం..చిప్ తో కూడిన ఈ-పాస్ పోర్టులు రానున్నాయ్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2020 | 12:46 PM

భారత ట్రావెల్ డాక్యుమెంట్ల సెక్యూరిటీ కోసం ప్రభుత్వం సరికొత్త విధానాన్ని చేపట్టింది. చిప్ తో కూడిన ఈ-పాస్ పోర్టుల తయారీకి అనువుగా ప్రొక్యూర్ మెంట్ ప్రాసెస్ ని చేపట్టినట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. వీటిని ప్రవేశపెట్టడంవల్ల ప్రయాణ సంబంధ పత్రాలు ‘సురక్షితంగా’ ఉంటాయని అన్నారు. పాస్ పోర్ట్ సేవా  దివస్ సందర్భంగా బుధవారం మాట్లాడిన ఆయన.. ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో పోస్టాఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 488 లోక్ సభ నియోజకవర్గాలకు వీటిని అందజేయగలిగామని, కరోనా మహమ్మారి కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. అయితే లాక్ డౌన్ ముగిశాక తిరిగి ప్రారంభిస్తామన్నారు.

ఈ-పాస్ పోర్టులను ప్రవేశ పెట్టడంవల్ల మన ప్రయాణ సంబంధ డాక్యుమెంట్లకు భద్రత ఉంటుందని, అది అందరికీ మంచిదని జైశంకర్ అన్నారు. నిబంధనలను ఎలా సులభతరం చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని, ప్రభుత్వం తన సంస్కరణల ప్రక్రియలో దీన్ని చేర్చిందని ఆయన చెప్పారు. 1967  జూన్ 24 న అప్పటి ప్రభుత్వం పాస్ పోర్టుల ప్రక్రియను ప్రారంభించింది.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో