టిక్ టాక్ ని ‘చోరీ’ చేస్తున్న అమెరికాను అడ్డుకుంటాం, చైనా

టిక్ టాక్ యాప్ అమెరికా, చైనా దేశాల మధ్య చిచ్చు రేపుతోంది. ఈ యాప్ ను 'దొంగిలించడానికి' అమెరికా యత్నిస్తోందని, దీన్ని అంగీకరించబోమని చైనా హెచ్చరించింది.

టిక్ టాక్ ని 'చోరీ' చేస్తున్న అమెరికాను అడ్డుకుంటాం, చైనా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 04, 2020 | 11:11 AM

టిక్ టాక్ యాప్ అమెరికా, చైనా దేశాల మధ్య చిచ్చు రేపుతోంది. ఈ యాప్ ను ‘దొంగిలించడానికి’ అమెరికా యత్నిస్తోందని, దీన్ని అంగీకరించబోమని చైనా హెచ్చరించింది. దీన్ని అమ్మడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న యోచనను కూడా ప్రతిఘటిస్తామని చైనా అనుకూల డైలీ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. మా టెక్నాలజీ కంపెనీలను చేజిక్కించుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ దీన్ని సాగనివ్వం.. ఎదుర్కొని తీరుతాం’ అని చైనా తెలిపింది. అమెరికాలోని టిక్ టాక్ ఆపరేషన్స్ ని తాము కొనుగోలు చేస్తామని మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించింది.. ఈ యాప్ కు సంబంధించిన కొన్ని కార్యకలాపాలను తాము డబ్బు పెట్టి కొంటామని, ఇందుకోసం దీని మాతృక సంస్థ బైట్ డాన్స్ తో చర్చలు జరుపుతున్నామని కూడా ఈ సంస్థ వెల్లడించింది.

టిక్ టాక్ ని బ్యాన్ చేస్తామని మొదట ప్రకటించిన ట్రంప్.. కాస్త వెనక్కి తగ్గి దీనికి 45 రోజుల గడువునిచ్చారు. తమ దేశానికి చెందిన ఏదైనా కంపెనీకి టిక్ టాక్ ని సెప్టెంబర్ 15 నాటికి విక్రయించాలని., అదే డెడ్ లైన్ అని స్పష్టం చేశారు. మా దేశ యూజర్ డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేసే చైనీస్ సంస్థలపై చర్య తీసుకుంటామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా ఈ వార్నింగ్ ఇచ్చింది.