ఆరంటే ఆరే కోవిడ్ కేసులు, 5 రోజుల్లో మొత్తం సిటీ అంతా టెస్టింగ్ ! వారెవా !

కరోనా వైరస్ అంటే చైనావాడి దూకుడే దూకుడు ! కేవలం ఆరంటే ఆరు వైరస్ కేసులు బయటపడడంతో.. మొత్తం సిటీ అంతా టెస్టింగ్ చేస్తారట ! క్విన్గ్ డావో అనే నగరంలో సుమారు 90 లక్షల జనాభా ఉంది.

  • Umakanth Rao
  • Publish Date - 11:37 am, Mon, 12 October 20

కరోనా వైరస్ అంటే చైనావాడి దూకుడే దూకుడు ! కేవలం ఆరంటే ఆరు వైరస్ కేసులు బయటపడడంతో.. మొత్తం సిటీ అంతా టెస్టింగ్ చేస్తారట ! క్విన్గ్ డావో అనే నగరంలో సుమారు 90 లక్షల జనాభా ఉంది. ఈ సిటీలో నిన్న ఆరుగురికి కోవిడ్ లక్షణాలు సోకాయి. దీంతో అధికారులు యుధ్ధ ప్రాతిపదికన జస్ట్ 5 రోజుల్లో మొత్తం నగరమంతా టెస్టింగుల మయం చేయాలని నిర్ణయించారు. మొదట మూడు రోజుల్లో 5 జిల్లాలు, అయిదు రోజుల్లో నగరమంతా కరోనా వైరస్ టెస్టులతో ‘అలరారుతుందట’..మెడికల్ సంస్థల సిబ్బందికి, కొత్త రోగులతో సహా అందరికీ ఇకటెస్టింగుల జాతరే జాతర !