నో-ఫ్లై జోన్ లోకి యుఎస్ స్పై జెట్ ప్రవేశించింది: చైనా

అమెరికా గూఢచారి విమానం చైనా మిలిటరీ ఉపయోగించే నో-ఫ్లై జోన్లోకి ప్రవేశించిందని చైనా ఆరోపించింది. లైవ్-ఫైర్ కసరత్తుల కోసం విమానం వచ్చిందని మండిపడ్డ చైనా.. ఇది రెచ్చగొట్టే చర్యగా పేర్కొంది.

నో-ఫ్లై జోన్ లోకి యుఎస్ స్పై జెట్ ప్రవేశించింది: చైనా
Follow us

|

Updated on: Aug 26, 2020 | 12:54 PM

అమెరికా గూఢచారి విమానం చైనా మిలిటరీ ఉపయోగించే నో-ఫ్లై జోన్లోకి ప్రవేశించిందని చైనా ఆరోపించింది. లైవ్-ఫైర్ కసరత్తుల కోసం విమానం వచ్చిందని మండిపడ్డ చైనా.. ఇది రెచ్చగొట్టే చర్యగా పేర్కొంది. ఇందుకు సంబంధించి చైనా మీడియా మంగళవారం తెలిపింది. ఉత్తర చైనాలోని ఒక ప్రాంతంపై U-2 నిఘా జెట్ విమానం ప్రవేశించిందని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించినట్లు చైనా మీడియా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య భద్రతా నియమాలను ఉల్లంఘించినట్లు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వు కియాన్ తెలిపారు. “యుఎస్ చర్య వల్ల ప్రమాదాలకు దారితీస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. ఈ చర్య స్పష్టమైన రెచ్చగొట్టే చర్య” అని మండిపడ్డారు. ఇటువంటి రెచ్చగొట్టే చర్యలను చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందన్నారు.

అయితే, గత కొద్దిరోజులుగా కరోనా మహమ్మారికి వ్యాప్తికి చైనా కారణమైందంటూ అమెరికా ఆరోపిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం, సైనిక, రాజకీయ విషయాలపై ఘర్షణలు తలెత్తాయి. యుఎస్, చైనా సంబంధాలు దిగజారిపోవడంతో చైనా ఆగ్రహంతో ఉంది. అటు, సైనిక రంగంలో, యుఎస్ నావికా దళాలు తైవాన్ సమీపంలో, దక్షిణ చైనా సముద్రంలో క్రమం తప్పకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇది ఏమాత్రం చైనాకు మింగుడుపడటంలేదు. దీంతో యూఎస్ పై ఎదురుదాడికి దిగుతోంది.