Telangana Cm Kcr: కొత్త సచివాలయ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నిర్మాణ పనుల పరిశీలన..

Telangana Cm Kcr: ఖైరతాబాద్‌లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ ప్రాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు..

Telangana Cm Kcr: కొత్త సచివాలయ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నిర్మాణ పనుల పరిశీలన..
Follow us

|

Updated on: Jan 26, 2021 | 3:33 PM

Telangana Cm Kcr: ఖైరతాబాద్‌లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ ప్రాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది, పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. కాగా, సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. వారితో పాటు.. వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ కూడా సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పాత సెక్రటేరియట్‌ని కూల్చిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమయ్యాక సీఎం కేసీఆర్ తొలిసారి సచివాలయ ప్రాంతానికి వచ్చారు.

అత్యాధునికంగా, అన్ని సౌకర్యాలతో నూతన సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 2019 జూన్ 26వ తేదీన శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని సమస్య కారణంగా పెండింగ్ పడుతూ వచ్చిన కొత్త సచివాలయ నిర్మాణ పనులు 2020, నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. రూ. 617 కోట్లతో చేపట్టిన ఈ సచివాలయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్ జి పల్లోంజి నిర్మిస్తోంది.

Also read:

Farmers’ tractor rally Live Updates : ఢిల్లీలో హైటెన్షన్, ఎర్రకోటపై జెండా ఎగరేసిన అన్నదాతలు

Casual Racism : ఒకే చోట ఉన్నా.. రెండు పద్ధతులు..! ఆస్ట్రేలియాలో మా క్వారంటైన్ ఎలా సాగిందంటే..!